కొండా (Konda) ప్రీ రిలీజ్ వేడుక‌కు పొలిటిక‌ల్ లీడ‌ర్‌ను గెస్ట్‌గా ఆహ్మానించిన ఆర్జీవీ (RGV)

Updated on Jun 17, 2022 06:46 PM IST
పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కొండా ముర‌ళి, కొండా సురేఖ దంప‌తుల జీవితం ఆదారంగా కొండా (Konda) సినిమాను నిర్మిస్తున్నారు. 
పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కొండా ముర‌ళి, కొండా సురేఖ దంప‌తుల జీవితం ఆదారంగా కొండా (Konda) సినిమాను నిర్మిస్తున్నారు. 

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ(RGV) స్టైలే వేరు. వివాదాల క‌థ‌ల‌తో వినోదాన్ని అందించ‌డంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఉన్న టాలెంటే వేరు. డిఫెరెంట్ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతారు. ప్ర‌స్తుతం కొండా (Konda) సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కొండా ముర‌ళి, కొండా సురేఖ దంప‌తుల జీవితం ఆదారంగా కొండా సినిమాను నిర్మిస్తున్నారు. 

ప్రీ రిలీజ్‌కు రానున్న రేవంత్ రెడ్డి

కొండా (Konda) సినిమా ప్రీ రిలీజ్ వేడుక వరంగ‌ల్‌లో జూన్ 18న జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ విషయన్ని ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.కొండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్న మిత్రుడు, తెలంగాణ సింహం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ ఆర్జీవీ త‌నదైన స్టైల్లో ఆహ్వానించారు. కొండా సినిమా జూన్ 23 న విడుద‌ల కానుంది. 

క‌త్తుల్లాంటి మాట‌ల‌తో పాట‌లు

కొట్టి.. కొట్టి.. చంపురా.. క‌త్తుల‌తో పొడుసురా అంటూ సాగిన కొండా సినిమాలో పాట ఉత్కంఠ క‌లిగిస్తుంది. కొండా ముర‌ళి, సురేఖలు ఇంత‌టి పోరాటం చేసి నాయ‌కులుగా ఎదిగారా అని అశ్చ‌ర్యం వేస్తుంది. కామ్రెడ్‌ల‌తో క‌లిసి దుర్మార్గుల‌ను చంపే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పోరాటాల‌తో తెలంగాణ పెత్తందారుల వ్య‌వ‌స్థ‌ను కూల్చేసే క‌థ‌గా కొండా సినిమా రానుంది. కొండా ముర‌ళికి సురేఖ ఎలా మ‌ద్ద‌తు తెలిపింది.. ఇద్ద‌రూ రాజ‌కీయాల వైపు ఎందుకు వ‌చ్చారనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. ఆర్జీవి (Ram Gopal Varma) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'కొండా' (Konda) సినిమా జూన్ 23న రిలీజ్ కానుంది. 

Read More: KONDAA TRAILER 2: కొట్టి కొట్టి చంపురా.. అంటూ సాగిన ఆర్జీవీ (Ram Gopal Varma) కొండా సినిమా ట్రైల‌ర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!