లైగర్ (Liger) ట్రైలర్ రియాక్ష‌న్ : విజ‌య్ నటన అద్భుతమంటూ ప్ర‌భాస్ ప్రశంసలు.. అంచనాలు ఆకాశాన్ని తాకాయన్న చిరు

Updated on Jul 21, 2022 03:17 PM IST
"లైగర్ (Liger)" సినిమా ట్రైల‌ర్ ఇండియాలో మొద‌టి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప్ర‌శంసిస్తున్నారు.
"లైగర్ (Liger)" సినిమా ట్రైల‌ర్ ఇండియాలో మొద‌టి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప్ర‌శంసిస్తున్నారు.

"లైగర్ (Liger)" సినిమా ట్రైల‌ర్ ఇండియ‌న్ సినిమా రంగాన్ని షేక్ చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) హీరోగా, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కించిన చిత్రం 'లైగ‌ర్'. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిరంజీవి, ప్ర‌భాస్‌లు క‌లిసి రిలీజ్ చేశారు.

సినిమా ట్రైల‌ర్‌ను మొద‌ట హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి విజ‌య్, పూరీ జ‌గ‌న్నాథ్, క‌ర‌ణ్ జోహార్, అన‌న్య పాండే హాజ‌ర‌య్యారు. హిందీ ట్రైల‌ర్ ఈవెంట్ జూలై 21 తేదిన సాయంత్రం ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు ర‌ణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. 

Liger (లైగర్) చిత్రంపై విజయ్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి

"లైగర్ (Liger)" ట్రైల‌ర్‌పై చిరు రియాక్ష‌న్
లైగ‌ర్ చిత్ర తెలుగు ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి రీలీజ్ చేశారు. 'ఇదిగో లైగ‌ర్ ట్రైల‌ర్' అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ మ‌రోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యార‌ని చిరంజీవి తెలిపారు.

లైగ‌ర్ సినిమా అంచ‌నాలు ఆకాశానికి తాకాయ‌న్నారు. లైగ‌ర్ చిత్ర యూనిట్‌కు 'ఆల్ ది వెరీ బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు చిరు. 

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) చిరంజీవి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. త‌న సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు,

విజ‌య్‌ను ఆకాశానికి ఎత్తేసిన ప్ర‌భాస్
'లైగ‌ర్' సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిరంజీవితో పాటు ప్ర‌భాస్ క‌లిసి విడుద‌ల చేశారు. ప్ర‌భాస్ ఈ ట్రైల‌ర్ రిలీజ్‌పై స్పందించారు. ' పూరీ జ‌గ‌న్నాథ్ గారు త‌న మాస్ యాక్ష‌న్ సినిమా లైగ‌ర్‌ను.. ఓ స్వర్గంలో తీసిన ఫీలింగ్ కలుగుతోందని' ప్ర‌భాస్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ చిత్ర‌ ట్రైల‌ర్ సూప‌ర్‌గా ఉంద‌న్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) ఓ అద్భుతాన్ని సృష్టించాడ‌ని ప్ర‌భాస్ తెలిపారు.

వావ్ అంటున్న దుల్క‌ర్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ 'లైగ‌ర్' సినిమా మలయాళ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. ఈ చిత్ర ట్రైల‌ర్ చూసి వండ‌ర్‌గా ఫీల్ అయ్యానంటూ దుల్క‌ర్ స‌ల్మాన్ ట్వీట్ చేశారు. 'ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూడండి' అంటూ లైగ‌ర్ మ‌ల‌యాళ ట్రైల‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

ర‌ణ్‌వీర్ సింగ్ రియాక్ష‌న్
"లైగర్ (Liger)" సినిమా హిందీ వ‌ర్ష‌న్ ట్రైల‌ర్‌ను బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ రిలీజ్ చేశారు. త‌న సోష‌ల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. చిత్ర యూనిట్‌కు 'ఆల్ ది బెస్ట్' తెలిపారు.

విజ‌య్ ఇండియాలో బిగ్ థింగ్ - పూరీ
భార‌తీయ సినిమా రంగంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్ స్టార్ అవుతార‌ని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అన్నారు. విజ‌య్ బిగ్ హీరో అవుతాడు.. కావాలంటే రాసిపెట్టుకోండి అంటూ ద‌ర్శ‌కుడు పూరీ ధీమా వ్య‌క్తం చేశారు.

విజ‌య్ న‌ట‌న‌తో చంపేశాడు - మంచు ల‌క్ష్మీ
విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌ట‌న చూస్తే దిమ్మ తిరిగిపోతుందని న‌టి మంచు ల‌క్ష్మీ తెలిపారు. 'ట్రైల‌ర్‌లో విజ‌య్ ఇర‌గదీశాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే విజ‌య్ న‌ట‌న‌తో చంపేశాడ‌ని' ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతీ విజువ‌ల్‌కు గూస్ బంప్స్ వస్తాయంటూ మంచు ల‌క్ష్మీ ట్వీట్ చేశారు.

లైగర్ (Liger) సినిమాలో రమ్యక్రిష్ణ కథానాయకునికి తల్లి పాత్రలో నటించారు.

"లైగర్ (Liger)" సినిమాను రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మించారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో వ‌స్తున్న 'లైగ‌ర్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

Read More : "లైగర్ (Liger)" ట్రైల‌ర్ రిలీజ్ : ఫైటర్‌గా రెచ్చిపోయిన రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!