"లైగర్ (Liger)" ట్రైల‌ర్ రిలీజ్ : ఫైటర్‌గా రెచ్చిపోయిన రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)

Updated on Jul 21, 2022 01:07 PM IST
 "లైగర్ (Liger)" ట్రైల‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌ట‌న అద్భుతంగా ఉంది. 'లైగ‌ర్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.
"లైగర్ (Liger)" ట్రైల‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌ట‌న అద్భుతంగా ఉంది. 'లైగ‌ర్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న "లైగర్ (Liger)" సినిమా ట్రైల‌ర్ భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా 'లైగ‌ర్' చిత్రాన్ని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు. 'లైగ‌ర్' సినిమా ట్రైల‌ర్ ఓ రేంజ్‌లో ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న, మాస్ డైలాగులు, దుమ్ము రేగొట్టే ఫైట్లు అదిరిపోయాయి. 'లైగ‌ర్' చిత్రం ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 'లైగ‌ర్' తెలుగు ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్‌ క‌లిసి రిలీజ్ చేశారు.

'లైగ‌ర్' ట్రైల‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌ట‌న అద్భుతంగా ఉంది. 'లైగ‌ర్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

విజ‌య్ న‌ట‌న‌కు ఫిదా అవ్వాల్సిందే
"లైగర్ (Liger)" ట్రైల‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌ట‌న అద్భుతంగా ఉంది. త‌న న‌ట‌న‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాపై అంచ‌నాలు పెంచారు. బాక్స‌ర్‌గా ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ అద‌ర‌గొట్టారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ చిత్రంలో న‌త్తితో స‌త‌మ‌త‌వుతూ ఉంటారు. మార్కెట్‌లో.. ట్రైన్‌లో.. ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విజ‌య్ త‌న‌తో గొడ‌వ ప‌డేవారిపై విరుచుప‌డుతుంటారు. అలాగే ఓ బాక్సర్‌గా రింగ్‌లో ప్రత్యర్థులపై తన సత్తా చూపిస్తుంటారు. 

ఈ సినిమాలో విజయ్ తన త‌ల్లి ర‌మ్య‌కృష్ణ‌తో క‌లిసి ఎక్క‌డ‌కు వెళ్లాడు? వారి జీవితాలను ప్రభావితం చేసిన అంశాలమేమిటి? ఎందుకు సాలా, క్రాస్ బ్రీడ్ అనే పదాలతో విజయ్ చెలామణీ అవుతూ ఉంటాడు. అతని గతం ఏమిటి?  "లైగర్ (Liger)" ఎవ‌రికి 'ఐ ల‌వ్ యూ' చెప్పాడు?. అనన్యపాండే విజ‌య్‌ను ఎందుకు దూరంగా ఉండ‌మంటుంది?. 'ఐ యామ్ ఏ ఫైట‌ర్' అంటూ విజ‌య్ ఎవ‌రికి వార్నింగ్ ఇచ్చాడు?. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే.. 'లైగ‌ర్' సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. 

విజయ్ త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌
ర‌మ్య‌కృష్ణ డైలాగులు  "లైగర్ (Liger)" ట్రైల‌ర్‌లో దుమ్ము రేపుతున్నాయి. 'ఒక‌ ల‌య‌న్‌కి, టైగ‌ర్‌కి పుట్టుండాడు.. క్రాస్ బ్రీడ్ స‌ర్ నా బిడ్డ' అంటూ ర‌మ్య‌కృష్ణ చెప్పిన‌ డైలాగులు ఆస‌క్తిగా మారాయి. అలాగే ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైస‌న్ ఎంట్రీని పూరి జ‌గ‌న్నాథ్ ఓ రేంజ్‌లో తెర‌కెక్కించారు. అలాగే ర‌ష్మిక మంద‌న స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించారు. 

'లైగ‌ర్' ట్రైల‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌ట‌న అద్భుతంగా ఉంది. 'లైగ‌ర్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

"లైగర్ (Liger)" సినిమాను రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మించారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో వ‌స్తున్న 'లైగ‌ర్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

Read More: Liger: లైగ‌ర్ కోసం రౌడీ హీరో సాహ‌సం... బోల్డ్ ఫోటోని పోస్ట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!