Liger Full Video Song: విజయ్ దేవరకొండ 'లైగర్' నుంచి అక్డి పక్డి (Akdi Pakdi) ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Updated on Jul 11, 2022 07:31 PM IST
'లైగర్' మూవీ పోస్టర్స్ (Liger Movie Posters)
'లైగర్' మూవీ పోస్టర్స్ (Liger Movie Posters)

Liger Full Song: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'లైగర్'. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరణ్ జోహర్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. 

లైగర్ (Liger) సినిమాలో మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేశాడు ఈ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. కాగా, మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదలగా.. యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. అలానే 'లైగర్ హంట్' అనే సాంగ్ థీమ్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక, ఇటీవల ఈ సినిమా నుండి ‘అక్డీ పక్డీ’ అంటూ ఓ ఎనర్జిటిక్ డ్యాన్స్ పార్టీ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను (Akdi Pakdi Song Promo) చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో ఈ పాటను చూసిన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

ఎవరూ ఊహించని విధంగా ఈ పాట ఔట్ అండ్ ఔట్ డ్యాన్స్ నంబర్‌గా ఉండటం.. ఈ పాటలో విజయ్ దేవరకొండ (Vijay devarakonda) అదిరిపోయే ఫాస్ట్ బీట్ స్టెప్పులతో రెచ్చిపోవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. అనన్యపాండే విజయ్‌తో పోటీపడి నర్తించింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది.

ఈ 'అక్డీ పక్డీ' (Akdi Pakdi Song) పాటను లిజో జార్జ్‌ డిజె చేతాస్‌ స్వరపరచగా.. సునీల్‌ కశ్యప్‌ హుక్‌లైన్‌ అందించారు. అజీమ్‌ దయాని సూపర్‌ వైజ్‌ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా సంయుక్తంగా ఆలపించారు. 

Read More: Liger: లైగ‌ర్ అప్‌డేట్స్ తెలిస్తే షాక్ అవాల్సిందే.. అన‌న్య‌తో విజిల్ వేయిస్తున్న విజ‌య్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!