Liger Trailer Update: 'లైగర్' నుంచి బిగ్ అప్ డేట్.. రికార్డులను తిరగరాసేందుకు ట్రైలర్ రాబోతోంది !

Updated on Jul 16, 2022 07:24 PM IST
'లైగర్' మూవీ పోస్టర్స్ (Liger Movie Posters)
'లైగర్' మూవీ పోస్టర్స్ (Liger Movie Posters)

Liger Trailer Update: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'లైగర్'. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కరణ్ జోహర్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 

బాక్సింగ్ నేప‌థ్యంలో 'లైగ‌ర్' సినిమా తెర‌కెక్కుతోంది. అంతర్జాతీయ బాక్సర్, లెజండరీ స్పోర్ట్స్‌మ్యాన్ మైక్ టైసన్ కూడా 'లైగ‌ర్' సినిమాలో న‌టిస్తున్నారు.'సాలా.. క్రాస్ బ్రీడ్' అనే డైలాగ్ ఈ సినిమాలోని ఏదో ప‌వ‌ర్ ఫుల్‌ సందర్భాన్ని గురించి చెబుతుంది . ఈ సినిమాలో మైక్ టైస‌న్ (Mike Tyson) ఇండియ‌న్ మహిళను పెళ్లి చేసుకుంటాడని ముందుగానే కథను ఊహించి పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. 

కాగా, ఈ సినిమాను రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. 

'లైగర్' సినిమాలో మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ (Ramya Krishna), రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేశాడు  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.

కాగా, మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ని అంతర్జాలంలో వదలగా.. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలానే 'లైగర్ హంట్' అనే సాంగ్ థీమ్‌ను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు.

ఇదిలా ఉంటే.. 'లైగర్' మూవీ నుంచి పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. జూలై 21 న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైగర్ ట్రైలర్ విడుదల కానున్నట్లు, కొద్ది క్షణాల క్రితమే అప్ డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో బాక్సింగ్ రింగ్‌లో లైగర్ నుంచి విజయ్ (Vijay Deverakonda) కొత్త పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేసారు. కాగా, ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. 

Read More: Liger Full Video Song: విజయ్ దేవరకొండ 'లైగర్' నుంచి అక్డి పక్డి (Akdi Pakdi) ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!