పవన్ (Pawan Kalyan) సరసన పూజా హెగ్డే (Pooja Hegde) ఫిక్స్!.. ఆసక్తిని రేకెత్తిస్తున్న హరీష్ శంకర్ ట్వీట్

Updated on Oct 17, 2022 02:16 PM IST
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)–హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కనున్న ఫిల్మ్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఖరారైందని సమాచారం
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)–హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కనున్న ఫిల్మ్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఖరారైందని సమాచారం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఆయన బిజీ అయ్యారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఈ సినిమా షూట్ ముగిసిన తర్వాత ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ తీయబోయే చిత్రం పనుల్లో నిమగ్నం కానున్నారు.  

హరీష్ శంకర్–పవన్ కల్యాణ్​ కాంబినేషన్‌లో సినిమా ప్రకటనతో ఒక్కసారిగా అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. వీరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ఎలా ఉంటుందోననే ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవర్ స్టార్  చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’లు విజయవంతమైనప్పటికీ.. పవన్ కల్యాణ్​ స్థాయికి తగ్గ వసూళ్లు సాధించలేదు. పవన్ సినిమా బాగుంటే ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఆయన నుంచి సాలిడ్ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ‘గబ్బర్ సింగ్’తో పవన్‌కు బంపర్ హిట్‌ను ఇచ్చిన హరీష్ శంకర్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. తదుపరి తీయబోయే చిత్రంతో పవన్ స్టామినాకు తగ్గ హిట్‌ను ఆయన అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఇక, పవన్ కల్యాణ్​–హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. పవన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనున్నారని తెలుస్తోంది. గతంలోనే పవన్ పక్కన పూజాను ఫైనలైజ్ చేశారని మీడియాలో కథనాలు వచ్చినా.. ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా హరీష్ శంకర్.. ఆమెకు విషెస్ తెలియజేయడమే కాకుండా త్వరలోనే ‘మీతో కలసి సెట్స్‌లో పని చేయడానికి ఎదురు చూస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పవన్ సినిమాలో కథానాయికగా పూజ పేరు కన్ఫర్మ్ అయ్యిందని ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి, దీనిపై చిత్ర బృందం త్వరలో స్పష్టత ఇస్తుందేమో చూడాలి. 

Read more: పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) కోసం కథ రాస్తున్న పరశురాం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!