సలార్ (Salaar) షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రభాస్ (Prabhas).. షెడ్యూల్ ఎన్ని రోజులంటే?

Updated on Sep 01, 2022 12:02 PM IST
హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో మొన్నటి వరకు జరిగిన ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు ప్రభాస్ (Prabhas)
హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో మొన్నటి వరకు జరిగిన ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు ప్రభాస్ (Prabhas)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మరో పవర్‌‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘సలార్’. కేజీఎఫ్‌ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై విజయ్ కిరగందూర్‌‌ సలార్ సినిమాను నిర్మిస్తున్నారు.

సలార్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్‌ ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ త్వరలోనే సలార్ షూటింగ్‌కు హాజరుకానున్నాడని తెలుస్తోంది.

హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో మొన్నటి వరకు జరిగిన ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు ప్రభాస్ (Prabhas)

దాదాపు నెలరోజులు..

తాజా అప్‌డేట్ ప్రకారం సెప్టెంబర్ 4వ తేదీన సలార్‌‌ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారని టాక్.

ఈనెలాఖరు వరకు సలార్ సినిమా షెడ్యూల్ కొనసాగనుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సలార్ సినిమా విడుదల కానుంది సలార్‌. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, పృధ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

డార్క్ షేడ్స్ బ్యాక్ డ్రాప్ లుక్‌తో అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తున్నారు ప్రభాస్‌ (Prabhas). శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సలార్‌‌ సినిమాకు కేజీఎఫ్‌ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్‌‌ సంగీతం చేస్తున్నారు.

Read More : ప్రభాస్ (Prabhas) పుట్టినరోజున బిల్లా సినిమా రీరిలీజ్.. పండుగ చేసుకోనున్న పాన్‌ ఇండియా స్టార్ ఫ్యాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!