ప్రభాస్ (Prabhas) తో ప్రత్యేకంగా భేటీ కానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పరామర్శ కోసమే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో కేంద్ర హోం శాఖ మంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్మించడానికి అమిత్ షా సెప్టెంబర్ 16న హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 కావడంతో ఆ వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ప్రభాస్‌తో కూడా భేటీ కానున్నారు.
కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు
కృష్ణంరాజు బీజేపీ పార్టీ తరఫున 1998లో కాకినాడ నుంచి, 1999లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చాక కృష్ణంరాజు సినిమాలకు దూరమయ్యారు. నిర్మాతగా గోపీకృష్ణ పతాకంపై సినిమాలు, సీరియల్స్ నిర్మించారు. ఇటు సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు.
పరామర్శ కోసమే
కృష్ణంరాజు మరణించిన వార్త తెలియగానే ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువరు బీజేపీ పార్టీ నాయకులు ట్వీట్ఱర్ వేదికగా నివాళులు అర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబసభ్యులను అమిత్ షా పరామర్మించనున్నారు.
అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమిత్ షా కేవలం సానుభూతి తెలిపేందుకే ప్రభాస్‌తో భేటీ కానున్నారని.. రాజకీయ సమావేశం కాదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read More: తన పెద్దనాన్నను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న ప్రభాస్ (Prabhas)