త‌న పెద్ద‌నాన్నను గుర్తుచేసుకుని క‌న్నీరు పెట్టుకున్న‌ ప్ర‌భాస్ (Prabhas)

Updated on Sep 11, 2022 05:35 PM IST
ప్ర‌భాస్ (Prabhas) త‌న పెద్ద‌నాన్న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని క‌న్నీరు పెట్టుకున్నారు. 
ప్ర‌భాస్ (Prabhas) త‌న పెద్ద‌నాన్న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని క‌న్నీరు పెట్టుకున్నారు. 

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) క‌న్నుమూశారు. పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌ల‌తో కొంత కాలంగా కృష్ణంరాజు బాధ‌ప‌డుతున్నారు. అంత‌కు ముందు ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా కృష్ణంరాజు మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యాయి. కృష్ణంరాజు త‌మ్ముడు కుమారుడు ప్ర‌భాస్ (Prabhas) కూడా సినీ రంగంలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ప్ర‌భాస్ త‌న పెద్ద‌నాన్న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని క‌న్నీరు పెట్టుకున్నారు. 

కృష్ణంరాజుకు టాలీవుడ్ నివాళి

కృష్ణంరాజు (Krishnam Raju) ను క‌డ‌సారి చూసేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆయ‌న నివాసానికి వెళ్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ‌, చిరంజీవి, మ‌హేష్ బాబు, మోహ‌న్ బాబు, ఎన్టీఆర్, ప‌వ‌న్ క‌ల్యాణ్, క‌ల్యాణ్ రామ్, వెంక‌టేష్, నాని కృష్ణంరాజు మృత‌దేహానికి నివాళులు అర్పించారు. ద‌ర్శ‌కులు రాఘ‌వేంద్ర‌రావు, త్రివిక్ర‌మ్, ప్ర‌శాంత్ నీల్‌తో పాటు నిర్మాత‌లు అశ్వినిద‌త్ వంటి ప్ర‌ముఖులు కృష్ణంరాజు నివాసానికి వెళ్లి మ‌రీ కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం తెలిపారు. 

క‌న్నీరు పెట్టుకున్న ప్ర‌భాస్

సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కృష్ణంరాజు పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణంరాజు అంత్య‌క్రియ‌ల‌ను అధికారికంగా నిర్వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో త‌ల‌సాని చెబుతున్న మాట‌లు వింటున్న ప్ర‌భాస్ ఒక్క‌సారిగా క‌న్నీరుమున్నీర‌య్యారు. త‌న పెద్ద‌నాన్న‌ను గుర్తుచేసుకుని ప్ర‌భాస్ విల‌పించారు. ప్ర‌భాస్ ఏడుస్తున్న వీడియోను అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

Read More: కృష్ణంరాజు (Krishnam Raju) ను చివ‌రి సారి వెంటిలేటర్‌పై చూసిన ప్ర‌భాస్ (Prabhas)!.. రేపు మ‌ధ్యాహ్నం అంత్య‌క్రియ‌లు

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!