ఆ సినిమా కారణంగా ఏడాది ఖాళీగా ఉన్నా..అదే నా కెరీర్‌లో వరస్ట్ టైమ్: పూజా హెగ్డే (Pooja Hegde)
పూజా హెగ్డే (Pooja Hegde)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌లో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ నటించింది పూజ. ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్‌గానూ ఎదిగింది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా సినిమాలతో ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్‌లో ఉంది. అయితే ఇటీవలే ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు కొంత నిరాశ పరిచాయి.
అయినా పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది ఈ భామ. స్పెషల్ సాంగ్స్‌లో నర్తించే అవకాశాలను కూడా అందుకుంటోందని టాక్.
హిందీలో సల్మాన్ ఖాన్ ‘కభీ ఈథ్ కభీ దివాలీ’, ’సర్కస్’ సినిమాల్లో నటిస్తోంది పూజా హెగ్డే. ఇటీవలే మీడియాతో ముచ్చటించిన పూజ తన కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌పై స్పందించారు. ‘తెలుగులో నేను నటించిన ఆరు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. అదే నా కెరీర్‌లో అతిపెద్ద సక్సెస్. ఇక నా కెరీర్‌లో వరస్ట్ మూమెంట్ నా తొలి (మొహంజోదారో) సినిమా. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నా కెరీర్‌లో చెత్త సినిమాగా నిలిచింది. ఆ సినిమా కారణంగా సుమారు ఏడాది పాటు నాకు సినిమా ఆఫర్లు రాలేదు.
కెరీర్ అద్భుతంగా..
‘మొహంజోదారో’ సినిమా ఫ్లాప్‌తో ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అయితే తెలుగులో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ నా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. నా కెరీర్ అద్భుతంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చింది పూజా.
బాలీవుడ్ మూవీ మొహంజోదారోతో సినీరంగ ప్రవేశం చేసింది పూజా. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. ఆ చిత్రంలో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ పక్కన హీరోయిన్‌గా నటించింది పూజా. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘జనగనమణ’ సినిమాతో పాటు పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూజా హెగ్డే (Pooja Hegde).