Pooja Hegde Home Tour: బ్యూటిఫుల్‌గా బుట్టబొమ్మ హౌస్.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంటిని ఎప్పుడైనా చూశారా?

Updated on Nov 17, 2022 01:22 PM IST
అత్యంత ఖరీదైన ఇంటి నిర్మాణాన్ని ఓ రీల్ వీడియోతో ఫ్యాన్స్‌కు వివరిస్తూ పూజ (Pooja Hegde) తన ఇంటిని పరిచయం చేశారు
అత్యంత ఖరీదైన ఇంటి నిర్మాణాన్ని ఓ రీల్ వీడియోతో ఫ్యాన్స్‌కు వివరిస్తూ పూజ (Pooja Hegde) తన ఇంటిని పరిచయం చేశారు

కన్నడ కస్తూరి పూజా హెగ్డే (Pooja Hegde) టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే బుట్టబొమ్మగా అభిమానుల్లో ఆమె పేరు స్థిరంగా నిలిచిపోయింది. అందంతోపాటు అభినయంతోనూ సినిమాల్లో తనదైన బలమైన ముద్రను వేసే యాక్టర్‌గా పూజకు మంచి పేరుంది. అందుకే ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోలతో కొన్ని మూవీల్లో యాక్ట్ చేసిన పూజ.. పలు వాణిజ్య ప్రకటనకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు.  

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. సినిమాలతోపాటు తన వ్యక్తిగత జీవితంలో జరిగే విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఆమె పోస్టుల కోసం అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇంటిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో అలంకరించిన తన కలల సౌధాన్ని గురించి ఓ వీడియోలో ఆమె వివరించారు. 

అత్యంత ఖరీదైన ఇంటి నిర్మాణాన్ని ఓ రీల్ వీడియోతో ఫ్యాన్స్‌కు వివరిస్తూ పూజ (Pooja Hegde Home Tour) తన ఇంటిని పరిచయం చేశారు. ఏషియన్ పెయింట్స్ ‘వేర్ ది హార్ట్ ఈజ్ సిరీస్’ వీడియోల్లో భాగంగా పూజ తన హౌస్‌ను ట్రైలర్ రూపంలో చూపించారు. పూజ తన ఇంటి డిజైన్ గురించి వివరిస్తూ.. ‘నా పేరెంట్స్ ఉద్యోగం చేస్తున్నారు. మా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చి పని ఒత్తిడిని ఎప్పుడూ తీసుకురాలేదు. ఆయన ఒక చిన్నపిల్లాడిలా మాతో ఆటలు ఆడేవారు. దానికి ప్రధాన కారణం.. మా ఇంటి వాతావరణమే’ అంటూ చెప్పుకొచ్చారు పూజా హెగ్డే. 

ఇకపోతే, పూజా హెగ్డేకు ఈ ఏడాది అంతగా కలసిరాలేదనే చెప్పాలి. ఆమె నటించిన ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’ చిత్రాలు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆమె అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. దీంతో పూజ కాస్త నిరాశగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’తోపాటు రణ్‌వీర్ సింగ్ పక్కన ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్నారు. మరి, ఈ చిత్రాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి. 

Read more: Vijay Deverakonda: గొప్ప మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. రౌడీస్టార్ కీలక నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న అభిమానులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!