Pooja Hegde : ' పూజా హెగ్డే 'కి షాకిచ్చిన 'బీస్ట్ ' సినిమా నిర్మాతలు.. చెల్లించలేమని బిల్లులు వెనక్కి పంపేశారట !
సౌత్‌లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది పూజా హెగ్డే (Pooja Hegde). ఈ భామకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలోని స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. అంతే కాకుండా, పాన్ ఇండియా చిత్రాల్లో సైతం నటిస్తూ పూజా బిజీగా మారింది. అయితే ఇటీవలి కాలంలో పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేక డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో పూజా హెగ్డేకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బడా నిర్మాత పూజాకు షాకిచ్చినట్టు, తమిళ మీడియాల్లో టాక్.
'బీస్ట్ ' సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్‌కు భారీగా ఖర్చయ్యిందని తెలుస్తోంది. కేవలం వాళ్ల ఫుడ్‌కే లక్షలు ఖర్చయ్యిందట. ఆ బిల్లులు ఇటీవలే 'బీస్ట్ ' సినిమాను తెరకెక్కించిన నిర్మాతలకు అందాయని సమాచారం.
ఆ బిల్లులు చూసి నిర్మాతలు కంగుతిన్నారని తెలుస్తోంది. పూజా స్టాఫ్ ఫుడ్‌కు, మెయింటెన్స్‌కు అయిన బిల్లు చూసి నిర్మాతలు నిర్ఘాంతపోయారని టాక్. 'బీస్ట్ ' మూవీ డిజాస్టర్‌తో భారీగా నష్టపోయిన నిర్మాతలకు.. పూజా, ఆమె స్టాఫ్‌కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట.
బిల్లులు తిప్పి పంపేసిన నిర్మాతలు!
ఈ బిల్లులతో తమకు సంబంధం లేదని.. తన స్టాఫ్‌కు అయిన ఖర్చులను, ఆమె మాత్రమే భరించాలని నిర్మాతలు వాటిని పూజాకు తిరిగి పంపేసినట్టు సమాచారం. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూజా కూడా ఆ బిల్లులను తానే చెల్లించాలని నిర్ణయించుకున్నట్టు సినీవర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ వార్తల్లో నిజమెంత అనేది ప్రస్తుతానికి తెలియదు. మరి ఈ వార్తలపై పూజా, బీస్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
గతంలో కూడా పూజా హెగ్డే (Pooja Hegde) ఖర్చుల విషయంలో, నిర్మాతలకు భారమయ్యేలా వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా, తన స్టాఫ్‌ను కూడా షూటింగ్ జరిగే ప్రదేశానికి తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Read More : దళపతి విజయ్ (Thalapathy Vijay) కొత్త సినిమా ‘వారసుడు’.. టైటిల్ ప్రకటించిన మేకర్స్