'ఎస్ఎస్ఎంబీ28'(SSMB28) గురించి ఆసక్తికర అప్డేట్.. మహేష్ బాబుకు (Mahesh Babu) విలన్ గా సంజయ్ దత్ (Sanjay Dutt)?

Updated on Oct 27, 2022 04:03 PM IST
విలక్షణ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు స్టైలిష్ విలన్ గా నటించబోతున్నారని టాక్.
విలక్షణ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు స్టైలిష్ విలన్ గా నటించబోతున్నారని టాక్.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ (Director Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

'ఎస్ఎస్ఎంబీ 28' (SSMB28) వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రం గురించి ఆసక్తికర అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మరో కథానాయికగా 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. 

పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ బడా హీరోని ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక ఆ పాత్ర కోసం బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) అయితే బాగుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది.

దీంతో విలక్షణ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు స్టైలిష్ విలన్ గా నటించబోతున్నారని టాక్. ఈ విషయమై ఫిలింనగర్ సిర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సంజయ్ దత్ సౌత్ సినిమాలపై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను సౌత్ సినిమాలలో నటించాలని కోరుకుంటున్నానని.. దక్షిణాది నుంచి ఏ దర్శకుడు నన్ను సంప్రదించినా కథ నచ్చితే కచ్చితంగా నటిస్తానని’’ అన్నారు.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ (Trivikram Srinivas) ఈ సినిమాలో తీసుకుంటున్న నటీనటుల ఎంపిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Read More: రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా మహేష్ బాబు (Mahesh Babu)-రాజమౌళి ప్రాజెక్ట్.. విజయేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!