వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌తేజ్‌ (Varun Tej), ఎఫ్‌3 స్పెషల్‌ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌.. ఆకట్టుకుంటున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్టెప్స్

Updated on May 16, 2022 01:56 PM IST
పూజా హెగ్డే
పూజా హెగ్డే

విక్టరీ వెంకటేష్ (Venkatesh), వరుణ్‌తేజ్(Varun Tej) హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్‌3. సూపర్‌‌హిట్‌ సినిమా ఎఫ్‌2కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్‌3 ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఎఫ్‌2కి సీక్వెల్‌గా వస్తుండడంతో ఈ సినిమాపై ముందు నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక, ఈ సినిమా ఫస్ట్‌ లుక్, ట్రైలర్, పాటలు రిలీజ్‌ అవుతుండడంతోనే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. మే 16వ తేదీన మరో సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. అంతేనా ఆ పాట ప్రోమో రిలీజ్ చేయనున్నట్టు చేసే ప్రకటనకు వీడియోను రిలీజ్ చేసింది. ఈ పాటలో మరో హైలైట్‌ కూడా ఉంది. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ పాటలో వెంకీ, వరుణల పక్కన ఆడిపాడనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

సోమవారం రిలీజైన ఈ వీడియోలో వెంకీ, వరుణ్‌లతో పాటు పూజా చేస్తున్న స్టెప్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ‘లైఫ్‌ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగుతున్న ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ పాట పూర్తి లిరికల్‌ వీడియో మంగళవారం రిలీజ్‌ కానుంది.

ఇక, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలో హీరోయిన్లు తమన్నా, మెహరీన్‌కు తల్లిగా నటించిన ప్రగతి ఇటీవల మీడియాతో మాట్లాడింది. ‘ఎఫ్‌3 సినిమా కథ నాకు అంతగా కనెక్ట్‌ అయ్యిందా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే నాకంత సీన్‌ లేదు. సినిమా పూర్తి కథ నాకు తెలీదు. డైరెక్టర్ నాకు పూర్తి కథ చెప్పాలేదు. నా పాత్ర వరకే చెప్పారు. ఇక, ఏ విషయాన్నైనా వరుణ్‌తేజ్ (Varun Tej) త్వరగా పట్టుకుంటారు. ఏదైనా విన్నా, చూసినా ఇట్టే పసిగట్టేస్తారు. వెంకటేష్‌ (Venkatesh) గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆయన సెట్‌లోకి రావడంతోనే యాక్టింగ్‌ మూడ్‌లోకి వెళిపోతారు’ అని చెప్పింది ప్రగతి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!