పూజా హెగ్డే (Pooja Hegde) కు షూటింగ్ లో గాయం.. 'లిగ్మెంట్ టియర్' అంటూ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్!

Updated on Oct 21, 2022 11:07 AM IST
ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే పూజా హెగ్డే (Pooja Hegde) ఒక్కసారిగా సైలెంట్ అయ్యి బెడ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే పూజా హెగ్డే (Pooja Hegde) ఒక్కసారిగా సైలెంట్ అయ్యి బెడ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాలీవుడ్, బాలీవుడ్ (Bollywood) సినిమాలతో పాటు తమిళంలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde). ఈ బ్యూటీ నటించిన గత కొన్ని చిత్రాలు వరుస పెట్టి పరాజయాల పాలవుతున్నప్పటికీ.. ఈ అమ్మడుకు ఆఫర్లు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. ఈ ఏడాది 'రాధేశ్యామ్', 'బీస్ట్', 'ఆచార్య' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది.. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో క్షణం తిరిక లేకుండా గడిపేస్తోంది. 

ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు (Mahesh Babu) సరసన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' అనే చిత్రంలో నటించబోతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో ఆమె తన 32వ పుట్టినరోజును కూడా జరుపుకుంది. 
 
అయితే, ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే పూజా హెగ్డే (Pooja Hegde) ఒక్కసారిగా సైలెంట్ అయ్యి బెడ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈమె కాలికి గాయమైందనే విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆమె తన పాదాలకు పట్టి కట్టి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… 'లిగ్మెంట్ టియర్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె షూటింగ్స్‏కు బ్రేక్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 

సోషల్ మీడియాలో పూజ హెగ్డే (Pooja Hegde) ఈ ఫోటోలు షేర్ చేయగా అభిమానులు కాస్త కంగారు పడ్డారని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో పూజ హెగ్డే (Pooja Hegde) ఈ ఫోటోలు షేర్ చేయగా అభిమానులు కాస్త కంగారు పడ్డారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పూజా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అయతే, ఎలా జరిగిందనే విషయాన్ని క్లియర్ గా చెప్పకుండానే అభిమానులను కంగారు పెట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. పూజ హెగ్డే సినిమా షూటింగ్ లో గాయపడిందా లేదంటే మరేదైనా చోట గాయం చేసుకుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ 'ఎస్ఎస్ఎమ్‌బీ 28'లో (SSMB28) నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) పూరి జగన్నాథ్ తీయ‌బోయే 'జనగణమన'లోనూ హీరోయిన్ గా ఎంపికయింది.

Read More: పవన్ (Pawan Kalyan) సరసన పూజా హెగ్డే (Pooja Hegde) ఫిక్స్!.. ఆసక్తిని రేకెత్తిస్తున్న హరీష్ శంకర్ ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!