మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB28’ సినిమాపై పుకార్లకు చెక్ పెట్టిన నిర్మాత!

Updated on Nov 01, 2022 11:03 AM IST
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘SSMB28’ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘SSMB28’ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' వంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూడవ సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు 12ఏళ్ళ త‌ర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెర‌కెక్కనుండటంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక, ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘SSMB28’ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. అయితే రెండు, మూడు రోజుల నుంచి ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు పుకార్లు వస్తున్నాయి. త్రివిక్రమ్ స్క్రిప్ట్ మహేష్ బాబుకి (Mahesh Babu) అంతగా నచ్చలేదని ఎప్పటికప్పుడు మార్పులు చెబుతూ వచ్చారట. డైలాగ్ వెర్షన్ తో సహా మొత్తం స్క్రిప్ట్ ని మార్చమని మహేష్ బాబు చాలానే చేంజెస్ చెప్పారట. ఈ క్రమంలోనే సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి.    

ఈ నేపథ్యంలో ‘SSMB28’ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా ఈ వార్తలకు చెక్‌ పెట్టాడు. ‘SSMB28’ సెకండ్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎగ్జ్‌జైటింగ్‌ అప్‌డేట్‌లు రానున్నట్లు వెల్లిడించాడు. ఈ ట్వీట్‌తో సినిమా కాన్సిల్‌ కాలేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో మహేష్ అభిమానులు మరోసారి ఈ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్‌ను సరికొత్త అవతారంలో మనకు చూపించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. 

ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు (Mahesh Babu), తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు. దీంతో మహేష్-త్రివిక్రమ్ మూవీ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్.చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కాబోతుంది.

Read More: 'ఎస్ఎస్ఎంబీ28'(SSMB28) గురించి ఆసక్తికర అప్డేట్.. మహేష్ బాబుకు (Mahesh Babu) విలన్ గా సంజయ్ దత్ (Sanjay Dutt)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!