విజయ్‌ దేవరకొండ కోసం స్టార్ హీరోల సినిమాలు వదులుకున్న పూజా హెగ్డే (Pooja Hegde)!

Updated on Jun 05, 2022 09:47 PM IST
విజయ్‌ దేవరకొండ, పూజా హెగ్డే (Pooja Hegde)
విజయ్‌ దేవరకొండ, పూజా హెగ్డే (Pooja Hegde)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్, మహేష్‌బాబులకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వాళ్లతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్‌ వస్తే చాలని అనుకుంటారు. అటువంటిది పవన్, మహేష్‌ సినిమాల్లో అవకాశం వచ్చినా వదులుకుంది బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde). ఆ ఇద్దరు హీరోలకీ పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ కోసం పూజా ఆ పని చేసిందని టాక్.

కొన్ని రోజుల నుంచి తానో యాక్షన్ సినిమాలో చేస్తున్నానని పూజా ప్రతీ ఇంటర్వ్యూలోనూ చెప్తూ వచ్చింది. అయితే ఎవరి సినిమా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలేదు. కానీ, ఇన్ని రోజుల తర్వాత అది విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న 'జన గణ మన' అని చెప్పింది. ఈ సినిమా షూటింగ్‌ శనివారం స్టార్ట్‌ అయ్యింది. ఈ షూటింగ్‌లో పూజా హెగ్డే జాయిన్ అయ్యింది. అయితే, ఈ సినిమాని ఒప్పుకోవడానికి ముందే పూజా హెగ్డే పవన్, మహేశ్ సినిమాలకు ఓకే చెప్పింది. పవన్‌కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న భవదీయుడు భగత్ సింగ్, SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న మహేష్‌బాబు సినిమా. తాజాగా ఈ రెండు సినిమాలకు చెక్‌ పెట్టి.. విజయ్‌ సినిమాలో నటిస్తోంది పూజ.

‘జన గణ మన’ చిత్ర యూనిట్‌తో హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)

క్లారిటీ లేకనేనా..

పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. దీంతో భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో క్లారిటీ లేదు. ఇక, మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట ఇటీవలే రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్‌ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు జరిగినా, ప్రస్తుతానికి షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. కాగా, 'జన గణ మన' పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుండడంతో పూజా హెగ్డే ఈ సినిమాకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ‘జన గణ మన’ సినిమాలో పూజ యాక్షన్‌ కూడా చేయనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పూజ (Pooja Hegde) ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.

Read More: విజయ్‌ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమాలో లిప్‌లాక్‌ సీన్లు? నిజమెంతో డైరెక్టరే తేల్చాలి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!