పాన్‌ వరల్డ్ సినిమాగా ప్రభాస్‌ (Prabhas) ‘ప్రాజెక్ట్‌ K’.. ‘ఆదిపురుష్‌’తో హాలీవుడ్‌లోకి రెబల్‌స్టార్

Updated on Jun 03, 2022 02:27 PM IST
ప్రభాస్‌ (Prabhas) ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ K’ పోస్టర్లు
ప్రభాస్‌ (Prabhas) ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ K’ పోస్టర్లు

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌‌ హోదాను సొంతం చేసుకున్నాడు రెబల్‌ స్టార్ ప్రభాస్ (Prabhas). ప్రభాస్ ఏ సినిమా చేసినా అదే రేంజ్‌లో ఉంటుందని ప్రేక్షకులు అంచనాకు వచ్చేస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. కేజీఎఫ్‌ సిరీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌‌ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ 40 శాతం పూర్తయినట్టు సమాచారం.

బిజీబిజీగా రెబల్‌స్టార్..

ఇక, సలార్‌‌తో పాటు ‘ప్రాజెక్ట్‌ K’ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్‌. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. సలార్‌‌తో పాటు ‘ప్రాజెక్ట్‌ K’ షూటింగ్‌ను కూడా పట్టాలెక్కించాడు రెబల్ స్టార్. ఈ సినిమాను పాన్‌ వరల్డ్‌ లెవెల్‌లో తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు ప్రభాస్. సలార్‌‌ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను హోంబలే బ్యానర్‌‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నాడు.

ప్రభాస్‌ (Prabhas), దీపికా పడుకోన్‌, అమితాబ్‌ బచ్చన్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ సినిమాలపై అభిమానులతోపాటు సినీ ప్రేమికులకు కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రశాంత్ నీల్‌ సలార్ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సలార్‌‌ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక, సలార్‌‌ సినిమాకు పూర్తి భిన్నంగా 'ప్రాజెక్ట్ K' సినిమా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో 'ప్రాజెక్ట్ K' ను నిర్మిస్తున్నారు. అశ్వనీదత్‌కు చెందిన నిర్మాణ సంస్థకు ఇది 50వ సినిమా కావడంతో బడ్జెట్‌కు ఏ మాత్రం వెనుకాడకుండా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ కావడంతో సినిమాను హాలీవుడ్‌లో కూడా రిలీజ్‌ చేసేలా అన్ని హంగులతో రూపొందిస్తున్నారు.

ఆదిపురుష్‌తో హాలీవుడ్‌లోకి..

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ పాన్ వరల్డ్ లెవెల్‌లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. 'ఆదిపురుష్' తో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు రెబల్‌స్టార్. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' సినిమా విడుదలవుతోంది. అయితే, ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను ఇంగ్లీషులో కూడా డబ్బింగ్‌ చేసి విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయంపై పలు హాలీవుడ్ సంస్థలతో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. దీంతో 'ప్రాజెక్ట్ K' కంటే ముందుగానే ప్రభాస్ (Prabhas) హాలీవుడ్ మార్కెట్‌లో 'ఆదిపురుష్' ద్వారా అడుగుపెట్టబోతున్నాడన్నమాట.

 

Read More: పవన్‌ మ్యానరిజం ఇష్టం.. ప్రభాస్ నా ఫేవరెట్‌ హీరో: రణ్‌బీర్‌‌ కపూర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!