Salaar : సలార్ దర్శకుడు 'ప్రశాంత్ నీల్' కి తన స్టైల్‌లో... బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రభాస్ !

Updated on Jun 04, 2022 05:29 PM IST
Salaar: 'సలార్' నిర్మాతలు ఈ సినిమా అప్డేట్స్ కోసమే ప్రత్యేకంగా ఒక ట్విటర్ ఖాతాను ప్రారంభించారు
Salaar: 'సలార్' నిర్మాతలు ఈ సినిమా అప్డేట్స్ కోసమే ప్రత్యేకంగా ఒక ట్విటర్ ఖాతాను ప్రారంభించారు

Prabhas: ప్రభాస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నపేరు. అందుకు కారణం, ఆయన నటిస్తున్న 'సలార్' చిత్రంపై ట్విటర్‌లో ప్రతీ రోజూ ఏదో ఒక తాజా అప్డేట్ రావడమే.

Salaar: 'సలార్' నిర్మాతలు ఈ సినిమా అప్డేట్స్ కోసమే ప్రత్యేకంగా ఒక ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. దీనిబట్టే, అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమాపై అభిమానులు ఎంత ఆశలు పెట్టుకున్నారో !

ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, 'సలార్' చిత్ర దర్శకుడికి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం, బాగా వైరల్ అవుతోంది. సినిమా సెట్స్ నుండే హ్యాపీ బర్త్‌డే విషెస్‌ను అందించారు.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సందేశాన్ని పంచుకున్నారు. సాధారణంగా, ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరనే విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

 

 

Prabhas: ప్రభాస్ 'రాధే శ్యామ్' తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకున్న చిత్రం ఇది.  విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సలార్ ఎప్పుడు విడుదల అవుతుందంటే?

Salaar: సలార్ షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయింది. 2023 వేసవికి ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలే పింక్‌విల్లాతో 'సలార్' నిర్మాతలు తమ ఆలోచనలను పంచుకున్నారు. "మేము ఈ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్నాం. చాలా రేర్ కాంబినేషన్ ఇది.  ఎందుకంటే 'బాహుబలి' లాంటి సినిమా విజయం సాధించాక, ఇండియాలో ఎక్కడచూసినా ప్రభాస్ పేరే మారుమ్రోగిపోతోంది. అలాగే కేజీఎఫ్ 2 చిత్రంతో ప్రశాంత్ నీల్ రేంజ్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. వీరిద్దరి కాంబినేషన్ అంటే, ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేం. ఈ చిత్రం విజయం సాధించాలి. అది మాకు చాలా అవసరం" అని తెలిపారు. 

Salaar: 'సలార్' ఒ అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రభాస్ పాత్ర చాలా డార్క్ స్టైల్‌లో, హాలీవుడ్ హీరోలను పోలి ఉంటుంది. అలాగే చాలా వయోలెంట్ సీన్స్‌లో ఆయన నటించారని టాక్. శ్రుతిహాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, దిశా పటానీ ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది.

సలార్ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో చాలా కీలకం

Prabhas: ప్రభాస్ 'రాధే శ్యామ్' తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకున్న చిత్రం ఇది.  విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరిరావు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

తెలుగులో తెరకెక్కే ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో డబ్ చేయనున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 

Read More: నీ బాంచ‌న్ ఐతా ఆదిపురుష్ అప్‌డేట్స్ ఇవ‌న్నా.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ వెరైటీ మీమ్స్

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!