జూనియర్‌‌ ఎన్టీఆర్‌ (Junior NTR)‌ – కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్‌ క్రష్‌ రష్మికా మందాన? నిజమెంతో

Updated on Sep 15, 2022 09:33 PM IST
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌‌ (Junior NTR) కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్‌ కానుంది
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌‌ (Junior NTR) కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్‌ కానుంది

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Junior NTR) -– -కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌30 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్‌ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ హిట్‌ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచి ఎన్టీఆర్‌30కి సంబంధించి రోజుకో వార్త నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ క్రమంలో ఎన్టీఆర్‌‌30 సినిమాలో హీరోయిన్‌ ఎవరనే దానిపై చర్చ మరోసారి మొదలైంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. జాన్వీకపూర్, సమంత ఎన్టీఆర్‌‌30 సినిమాలో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌‌ (Junior NTR) కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్‌ కానుంది

ఎవరూ అడగలేదన్న జాన్వీ..

అయితే జాన్వీకపూర్‌‌ మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఇక, ఎన్టీఆర్‌‌ సరసన సమంత ఆడిపాడనుందని వార్తలు వచ్చాయి. అయితే రెమ్యునరేషన్ కారణంగా సమంత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్‌‌30లో హీరోయిన్‌ ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరోయిన్ రష్మికా మందాన.  దాంతో సౌత్‌, నార్త్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌ అయ్యారు. ప్రస్తుతం రష్మికకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆమెను ఎన్టీఆర్‌‌30 సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారని టాక్. డైరెక్టర్‌‌ కొరటాల శివ ఇప్పటికే ఆమెను కలిసి కథ చెప్పారని, దానికి ఆమె ఓకే చెప్పారని ఇండస్ట్రీ టాక్. అదే నిజమైతే ఎన్టీఆర్‌‌ (Junior NTR) సరసన నేషనల్ క్రష్ రష్మికా మందాన ఆడిపాడుతుందన్నమాట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read More : స్పోర్ట్స్ డ్రామాగా జూనియర్‌‌ ఎన్టీఆర్ (Junior NTR)-బుచ్చి బాబు కాంబినేషన్ మూవీ.. ద్విపాత్రాభినయంలో తారక్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!