బాహుబలి–3 (Baahubali 3)పై ముందే హింట్ ఇచ్చిన రాజమౌళి (SS Rajamouli)!

Updated on Oct 06, 2022 04:43 PM IST
మూవీ మారథాన్‍లో పాల్గొన్న రాజమౌళి (SS Rajamouli).. బాహుబలి (Baahubali 3) యూనివర్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు 
మూవీ మారథాన్‍లో పాల్గొన్న రాజమౌళి (SS Rajamouli).. బాహుబలి (Baahubali 3) యూనివర్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు 

టాలీవుడ్ సినిమా రేంజ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిన సినిమాగా ‘బాహుబలి’ (Baahubali)ని చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే.. తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas)ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. 

వరల్డ్ వైడ్‌గా పలు భాషల్లో రిలీజైన బాహుబలి రెండో పార్ట్ దాదాపుగా రూ.1,800 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో బాహుబలి–3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ పార్ట్ త్వరలో తెరకెక్కుతుందని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్ని పుకార్లు వచ్చినా.. వాటిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకుడు రాజమౌళి కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించే పనుల్లో నిమగ్నమవ్వడంతో రూమర్స్‌కు చెక్ పడింది. 

ఇదిలాఉంటే.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మూవీ మారథాన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఈగ చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌లో జక్కన్న కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ ‘క్యూ అండ్ ఏ’ సెషన్‌ను నిర్వహించింది. 

ఈ ఈవెంట్‌లో భాగంగా ‘బాహుబలి 3’ తీస్తానని రాజమౌళి చెప్పినట్లు అనూప్ దాసరి అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘మూవీ మారథాన్ తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్‌లో జక్కన్న మాట్లాడారు. ఆయన చేసిన సినిమాల్లో ఒకే ఒక చిత్రం క్లైమాక్స్‌లో మాత్రం ఓపెన్ ఎండ్‌గా ఓ సంభాషణను పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అది బాహుబలి 2 ఎండ్ క్రెడిట్స్‌లోనే.. అక్కడ ఒక చిన్న అమ్మాయి వాయిస్ ఓవర్ ఉంది. అది బాహుబలి 3 (Baahubali 3) కోసం సూచన. మీలో ఎంత మంది దానిని గమనించారు’ అని జక్కన్న చెప్పినట్లు అనూప్ ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

శివయ్య మనసులో ఏముందో..? 

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. తాను చూశానంటూ బదులిచ్చాడు. మరో నెటిజన్ ‘బాహుబలి: కన్‌క్లూజన్’లో సినిమాకు శుభం కార్డు పడే సమయంలో.. ఈ మూవీలో స్వామిజీ పాత్రధారి తనికెళ్ల భరణికి, ఓ పాపకు జరిగిన డైలాగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.

ఆ వీడియోలో ‘అంటే తాతా.. మహేంద్ర బాహుబలి కొడుకు రాజయ్యాడా’ అని పాప అడుగుతుంది. దీనికి ‘ఏమో.. శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటి ఎరుక’ అని తనికెళ్ల బదులివ్వడాన్ని చూడొచ్చు. దీన్ని బట్టి బాహుబలి మూడో పార్ట్ గురించి రాజమౌళి ముందే హింట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి, బాహుబలి–3పై జక్కన్న అధికారిక ప్రకటన చేసే వరకు దీనిపై క్లారిటీ రాదనే చెప్పాలి. 

ఇకపోతే, బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన సాహో మూవీ తెలుగునాట పెద్దగా నడవకపోపయినా.. హిందీలో మంచి హిట్ సాధించింది. దీంతో ఉత్తరాదిన ఆయన ఇమేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాల్లో నటిస్తూ ప్రభాస్ బిజీబిజీగా ఉన్నారు. 

Read more: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఆర్ఆర్ఆర్ (RRR Movie).. ప్రమోషన్స్‌కు వెళ్లనున్న జక్కన్న అండ్ కో?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!