KGF Chapter 2: "కేజీఎఫ్ చాప్ట‌ర్ 2" 100 రోజుల వేడుకలు .. స్పెష‌ల్ వీడియో పోస్ట్ చేసిన మేక‌ర్స్ !

Updated on Jul 23, 2022 04:48 PM IST
KGF Chapter 2: య‌శ్, ప్రశాంత్ నీల్ కాంబోలో రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది.
KGF Chapter 2: య‌శ్, ప్రశాంత్ నీల్ కాంబోలో రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది.

KGF Chapter 2: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమా వంద రోజులు పూర్తి చేసుకొని మ‌రో సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది. ప‌లు థియేట‌ర్ల‌లో య‌శ్ (yash) న‌టించిన ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలను జరుపుకుంది. ఈ వేడుకల సంద‌ర్భంగా, మేక‌ర్స్ స్పెష‌ల్ వీడియాను రిలీజ్ చేశారు. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' చిత్రాన్ని నిర్మించిన హోంబ‌లే ఫిలిమ్స్ ప్రేక్ష‌కుల‌కు ఈ వీడియో ద్వారా ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకుల ఆదరణను, అభిమానాన్ని మర్చిపోలేమని తెలిపింది. 

KGF Chapter 2 : కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 క‌న్న‌డ సినిమా చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. య‌శ్ హీరోగా, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో ఏప్రిల్ 14న 'కేజీఎఫ్ చాప్ట‌ర్ '2 ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ఇప్ప‌టి వ‌రకు, రికార్డులు మీద రికార్డులు సాధిస్తూనే ఉంది. కన్నడ భాషలో విడుదలై.. ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో వేయి కోట్ల‌ రూపాయలకు పైగా వ‌సూళ్లు సాధించిన తొలి ఇండియ‌న్ సినిమాగా ఈ చిత్రం కొత్త రికార్డులు తిరగరాసింది. 

KGF Chapter 2: య‌శ్, ప్రశాంత్ నీల్ కాంబోలో రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది.

'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' సినిమా  100 రోజులు పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ ఈ సందర్భంగా మీడియాతో తమ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్ 2' చిత్రం  రూ.1235 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసి, కొత్త రికార్డులను తిరగరాసింది . 'కేజీఎఫ్ చాప్ట‌ర్2' చిత్రాన్ని. క‌న్న‌డ‌ంతో పాటు హిందీ, త‌మిళం, తెలుగు, మలయాళ భాషలలో కూడా విడుదల చేశారు. అన్ని భాషలలోనూ ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 

Read More : Yash: య‌శ్‌.. ఓ చ‌రిత్ర రాసిన ఘ‌నుడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!