మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’కు ముందుగా అనుకున్న టైటిల్‌ ఏంటి! ఎవరు సజెస్ట్‌ చేశారో తెలుసా?

Updated on Oct 15, 2022 04:03 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గాడ్‌ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. గాడ్‌ఫాదర్ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్‌ఖాన్, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటించారు. గాడ్‌ఫాదర్ సినిమా విజయంలో టైటిల్‌ కూడా ప్రముఖ పాత్ర పోషించిందనే విషయం తెలిసిందే.

గాడ్‌ఫాదర్‌‌ టైటిల్‌తో హాలీవుడ్‌లో ఒక సినిమా వచ్చి సూపర్‌‌హిట్‌గా నిలిచింది. గ్యాంగ్‌స్టర్ సినిమాలకు బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసింది ఆ సినిమా. ఇక, చిరంజీవి సినిమాకు అంత పవర్‌‌ఫుల్‌ టైటిల్‌ పెట్టడం వెనుక కారణాలు ఏంటని అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న. అసలు గాడ్‌ఫాదర్ అనే టైటిల్‌ను ఎవరు సజెస్ట్‌ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది

సెంటిమెంట్‌గా కూడా..

కొన్ని టైటిల్స్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. అటువంటి టైటిలే గాడ్ ఫాదర్. మలయాళ సినిమా లూసిఫర్‌‌కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమాకు గాడ్‌ఫాదర్ టైటిల్ ఫిక్స్ చేశారు.ఈ టైటిల్ సెట్ చేసింది దర్శకుడు మోహన్ రాజా కాదనే విషయాన్ని చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.  

గాడ్‌ఫాదర్ సినిమాకు ముందుగా సర్వాంతర్యామి అనే టైటిల్‌ను అనుకున్నారు. షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా అదే టైటిల్‌ను చిత్ర యూనిట్ దాదాపుగా ఫిక్స్ అయ్యారు కూడా. అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం వేరే టైటిల్‌ను సజెస్ట్ చేశారు. అదే గాడ్‌ఫాదర్. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ సినిమాలు జీ అనే అక్షరంతోనే మొదలవుతాయని, గాడ్‌ఫాదర్ సినిమాకు ఆ సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్ అవుతుందని చెప్పారట థమన్. అది అందరికీ నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాకు గాడ్‌ఫాదర్ టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. 

Read More : రూ.100 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’.. 4 రోజుల్లోనే భారీ కలెక్షన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!