చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాదర్ సినిమా చూసిన రజినీకాంత్ (Rajinikanth).. బాగుందని కితాబిచ్చిన తలైవా!

Updated on Oct 13, 2022 12:50 PM IST
మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమాను సూపర్‌‌స్టార్ రజినీకాంత్  చూసి ప్రశంసించారన్నారు దర్శకుడు మోహన్‌రాజా
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమాను సూపర్‌‌స్టార్ రజినీకాంత్ చూసి ప్రశంసించారన్నారు దర్శకుడు మోహన్‌రాజా

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం గాడ్‌ఫాదర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌‏తో దూసుకుపోతోంది. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌‌ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ తెరకెక్కింది. ఈ సినిమాను సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇటీవల చూశారని సమాచారం.

మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్‌ఫాదర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో లేడీ సూపర్‌‌స్టార్ నయనతార, సత్యదేవ్, సల్మాన్‌ఖాన్ కీలకపాత్రలు పోషించారు. పొలిటికల్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన గాడ్‌ఫాదర్ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమాను అక్టోబర్‌‌ 10వ తేదీన సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ చూసి రివ్యూ కూడా ఇచ్చారని దర్శకుడు మోహన్‌రాజా చెప్పారు. ‘గాడ్‌ఫాదర్ సినిమా చూసి తలైవా ఎంజాయ్ చేశారు. చాలా బాగుందని అన్నారు. తెలుగు వెర్షన్ కోసం చేసిన మార్పులను రజినీకాంత్‌ ప్రశంసించారు. ధన్యవాదాలు సార్. నా జీవితంలోని అత్యుత్తమ క్షణాల్లో ఇది కూడా ఒకటి’ అని ట్విట్టర్‌‌లో రాసుకొచ్చారు దర్శకుడు మోహన్‌రాజా.

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమాను సూపర్‌‌స్టార్ రజినీకాంత్  చూసి ప్రశంసించారన్నారు దర్శకుడు మోహన్‌రాజా

గ్రాండ్‌గా సక్సెస్‌మీట్..

కాగా, మెగాస్టార్‌‌ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్‌‌ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ అభిమానులతోపాటు సినీ ప్రముఖులు కూడా సినిమా చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవలే గాడ్‌ఫాదర్‌‌ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  డైరెక్టర్ మోహన్ రాజా అక్కినేని నాగార్జునతో సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మల్టీస్టారర్‌‌గా రూపొందనున్న ఈ సినిమాలో అక్కినేని అఖిల్‌ కూడా నటించనున్నారని టాక్.  

Read More : రజినీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay) వంటి స్టార్‌‌ హీరోల రెమ్యునరేషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!