అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తోంది!.. అనారోగ్యంపై స్పందిస్తూ సమంత (Samantha Ruth Prabhu) కన్నీళ్లు

Updated on Nov 08, 2022 06:25 PM IST
చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారని సమంత (Samantha Ruth Prabhu) అన్నారు. చివరికి మనమే విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు
చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారని సమంత (Samantha Ruth Prabhu) అన్నారు. చివరికి మనమే విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు

స్టార్ కథానాయిక సమంత (Samantha Ruth Prabhu) ఇటీవల అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. ‘మయోసైటిస్’ అనే వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో సామ్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులతోపాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

రికవరీ అవుతున్నా: సమంత

ప్రస్తుతం ‘యశోద’ (Yashoda) మూవీలో సమంత నటిస్తున్నారు. ‘మయోసైటిస్’తో పోరాటం చేస్తూనే చికిత్స (సెలైన్) తీసుకుంటూ ‘యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు సామ్. ఇంకా పూర్తిగా కోలుకోనప్పటికీ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. తాను రికవరీ అవుతున్నానని ఆమె చెప్పారు. త్వరలో పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నానని అన్నారు. 

 తాను రికవరీ అవుతున్నానని సమంత (Samantha Ruth Prabhu) చెప్పారు

సవాళ్లతో యుద్ధం చేస్తున్నా

‘నేను ఫైట్ చేస్తున్నా. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం కాదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు.. కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడు రోజులు ఉంటాయి. ఒక్కో రోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చానా అని అనిపిస్తోంది. చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. చివరికి మనమే విజయం సాధిస్తాం’ అని చెబుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు. 

ఆడియెన్స్ థ్రిల్ అవుతారు

‘యశోద’ సినిమా టీజర్, ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉందని సమంత అన్నారు. ఆడియెన్స్ చూస్తుంటే ఎగ్జయిట్‌మెంట్‌తోపాటు కొంచెం నెర్వస్‌గా కూడా ఉందన్నారు. చిత్రం కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని సామ్ పేర్కొన్నారు. ‘యశోద’ పాత్ర తనకు బాగా నచ్చిందని.. కథ విన్న వెంటనే ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పానన్నారు. స్టోరీ విన్నప్పుడు చాలా థ్రిల్ అయ్యానని.. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని ఆమె చెప్పుకొచ్చారు.  

Read more: విశ్వక్ (Vishwak Sen) స్థానంలో శర్వా (Sharwanand)!.. కథ వినిపించేందుకు రెడీ అవుతున్న అర్జున్ (Arjun Sarja)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!