సెప్టెంబర్‌‌లో సందడి చేయనున్న వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు

Updated on Sep 02, 2022 04:14 PM IST
వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి
వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయంటేనే సందడి వాతావరణం నెలకొంటుంది. చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఏ సినిమా రిలీజైనా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అటువంటిది కొంత క్రేజ్ ఉన్న హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే ఇంక వాళ్ల సందడికి అడ్డు ఉండదు. సెప్టెంబర్‌‌ నెలలో థియేటర్లలో విడుదల కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం.

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

రంగరంగ వైభవంగా..

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్ (VaishnavTej). ఉప్పెన సినిమాతో భారీ హిట్‌ అందుకున్న ఈ హీరో తర్వాత చేసిన కొండపొలం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈసారి కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రంగరంగ వైభవంగా సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్‌‌ 2వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన రంగరంగ వైభవంగా సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో..

శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బసు హీరోహీరోయిన్లుగా నటించగా వంశీధర్‌‌ గౌడ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. జాతిరత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ ఈ సినిమాకు కథ అందించార. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా కూడా సెప్టెంబర్‌‌ 2న విడుదలైంది.

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

ఒకే ఒక జీవితం..
శర్వానంద్ (Sharwanand) హీరోగా రీతూ వర్మ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘ఒకే ఒక జీవితం’ శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంది. తమిళ స్టార్ హీరో కార్తి ఒకే ఒక జీవితం సినిమాలో పాట పాడారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఒకే ఒక జీవితం సినిమాలో అక్కినేని అమల కీలకపాత్రలో నటించారు

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

నేను మీకు బాగా కావాల్సినవాడిని..
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా తెరకెక్కిన సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాకు శ్రీధర్‌‌ గాదే దర్శకత్వం వహించారు. సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటించారు.

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

శాకిని..డాకిని..
రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా శాకిని డాకిని. సుధీర్‌‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్‌బాబు నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ కామెడీ జానర్‌‌లో తెరకెక్కిన శాకిని డాకిని సినిమా సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కానుంది.

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

క్రేజీ ఫెలో..
యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా తెరకెక్కుతున్న సినిమా క్రేజీ ఫెలో. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ధ్రువన్ సంగీతం అందించిన క్రేజీ ఫెలో సినిమా సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

అల్లూరి..
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా అల్లూరి. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామా జానర్‌‌లో ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కించారు. సెప్టెంబర్ 23వ తేదీన అల్లూరి సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
 
వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej), శర్వానంద్ (Sharwanand), మణిరత్నం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి

పొన్నియిన్ సెల్వన్..
క్లాసిక్‌ డైరెక్టర్‌‌ మణిరత్నం (ManiRatnam) దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పొనియిన్ సెల్వన్’ ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

Read More : శ‌ర్వానంద్ (Sharwanand) హీరోగా ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham).. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!