Unstoppable: అడివి శేష్‌ (Adivi Sesh), శర్వానంద్‌ (Sharwanand)లతో బాలయ్య అల్లరి అదిరిపోయిందిగా.. ప్రోమో వైరల్!

Updated on Nov 01, 2022 12:56 PM IST
'అన్‌స్టాపబుల్‌ 2' మూడో ఎపిసోడ్‌లో భాగంగా కుర్ర హీరోలు అడివి శేష్‌ (Adivi Sesh), శర్వానంద్‌ (Sharwanand) అతిథిలుగా హాజరవుతున్నారు.
'అన్‌స్టాపబుల్‌ 2' మూడో ఎపిసోడ్‌లో భాగంగా కుర్ర హీరోలు అడివి శేష్‌ (Adivi Sesh), శర్వానంద్‌ (Sharwanand) అతిథిలుగా హాజరవుతున్నారు.

తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'ఆహా'లో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే' (Unstoppable With NBK) షో రోజురోజుకీ ప్రేక్షకాదరణ పొందుతూ దూసుకుపోతోంది. ఈ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనదైన స్టైల్ లో ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తున్నారు. దీంతో 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' గ్రాండ్ గా కొనసాగుతోంది. 

'అన్‌స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable Season 2) నుంచి ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రసారం కాగా.. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో మూడో ఎపిసోడ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది ఆహా బృందం. నవంబర్ 4వ తేదీన ఈ ఎపిసోడ్ ఆహ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

'అన్‌స్టాపబుల్‌ 2' మూడో ఎపిసోడ్‌లో భాగంగా కుర్ర హీరోలు అడివి శేష్‌ (Adivi Sesh), శర్వానంద్‌ (Sharwanand) అతిథిలుగా హాజరవుతున్నారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇద్దరు కుర్రకాలతో బాలయ్య బాబు చేసిన సందడి వావ్‌ అనిపించేలా ఉంది. శర్వానంద్, అడివి శేష్‌కి కొంటె ప్రశ్నలు వేసిన నందమూరి బాలకృష్ణ చాలా సరదాగా మాట్లాడుతూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఆ క్రమంలో కాస్త చొరవ తీసుకున్న శర్వానంద్ డబుల్ మీనింగ్‌ డైలాగ్‌ వేశాడు. ఆ తర్వాత బాలకృష్ణ డబుల్ మీనింగ్ ప్రశ్నలతో వారిని ముప్పుతిప్పలు పెట్టాడు.

ఇక, ప్రోమోలో మొదటగా అడవి శేష్ (Adivi Sesh) వచ్చిరాగానే బాలకృష్ణ కాళ్లకి మొక్కాడు. దాంతో బాలయ్య కాస్త సీరియస్‌గా పేస్‌ పెట్టి.. "చిన్న పిల్లలు దేవుడితో సమానం అలా కాళ్ల మీద పడిపోకూడదు" అని అన్నాడు. దానికి అడవి శేష్ పెద్ద వాళ్లు దేవుడితో సమానం అని విన్నాను అంటూ వినయం నటిస్తూ రిప్లై ఇచ్చాడు. పక్కనే ఉన్న శర్వానంద్ ‘అతని పేరు బాలయ్య.. అతను ఇప్పటికీ బాల’ అంటూ సెటైర్ పేల్చాడు.

రష్మిక మందన్నా (Rashmika Mandanna) అంటే తనకి క్రష్‌ అని బాలయ్య గత ఎపిసోడ్ లో చెప్పడంతో శర్వానంద్ మీకు ఒక చిన్న గిప్ట్ సార్ అంటూ రష్మికతో వీడియో కాల్‌లో మాట్లాడించాడు. అనంతరం మీరు వందపైన సినిమాలు చేశారు కదా..? కనీసం ఓ పాతిక ముప్పై మంది హీరోయిన్లతోనైనా చేసుంటారు కదా? అని బాలయ్యని శర్వానంద్ అడిగాడు. దానికి పక్కనే ఉన్న అడవి శేష్.. చేసుంటారా? అంటూ నవ్వేశాడు. దానికి అదేరా యాక్టింగ్ చేసుంటారు కదా? అని శర్వానంద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బాలయ్యకి శర్వానంద్ వైపు కోపంగా చూస్తూ ఇవన్నీ ‘బి’ సెంటర్ వాడి తెలివితేటలు అంటూ  కౌంటర్ ఇచ్చాడు.

ఆ తర్వాత బాలయ్య (Nandamuri Balakrishna), శర్వానంద్, అడివి శేష్ కలిసి 'ఊ అంటావా మామ ఊ ఊ అంటావా' సాంగ్ కి రెచ్చిపోయి డ్యాన్సులు వేశారు. ప్రోమో చూస్తుంటే యువ హీరోలతో కలిసి బాలయ్య ఈ ఎపిసోడ్ లో ఫుల్ గా రచ్చ చేసినట్టు అర్ధమవుతోంది. ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా హీరోయిన్స్, సినిమాలు, రొమాంటిక్ అంశాలు, పెళ్లిళ్ల గురించి మాట్లాడటంతో ఈ ఎపిసోడ్ కచ్చితంగా రొమాంటిక్ ప్రశ్నలతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Read More: ‘అన్ స్టాపబుల్ -2’ (Unstoppable 2) మూడో ఎపిసోడ్ కు గెస్టులుగా శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!