ఓటీటీలో విడుదలైన శర్వానంద్ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమా.. ఇంతకీ ఎక్కడంటే?

Updated on Oct 20, 2022 03:41 PM IST
ఎప్పుడెప్పుడూ అని ఎదురూచూస్తున్న ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎప్పుడెప్పుడూ అని ఎదురూచూస్తున్న ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరో శర్వానంద్ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. గత కొంతకాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్నాడు శర్వా. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్‌ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలయింది.

దర్శకుడు శ్రీకార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో శర్వానంద్ (Sharwanand) సరసన రీతూ వర్మ (Reetu Varma) కథానాయికగా నటించగా.. అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిషోర్,  రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి జేక్స్‌ బేజోయ్ సంగీతం అందించాడు. శర్వానంద్ ఈ సినిమాలో బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు.

టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మ సెంటిమెంట్‌ను కూడా జోడించి దర్శకుడు శ్రీకార్తిక్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అంతే అద్భుతంగా పోటీగా ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra) వంటి పాన్ ఇండియా సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ.

ఇక, ఎప్పుడెప్పుడూ అని ఎదురూచూస్తున్న ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో (Sony Liv OTT) ఈ చిత్రం గత రాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి అప్పుడు ఈ సినిమాని మిస్ అయ్యినవారు డెఫినెట్ గా ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడవచ్చు. కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో 'కణం' పేరుతో విడుదలైంది.

Read More: ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతున్న ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham).. యూఎస్ లో భారీగా బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!