హీరో శర్వానంద్ (Sharwanand)‘ఒకే ఒక జీవితం’ సినిమా కోసం పాట పాడిన తమిళ హీరో కార్తి (Karthi)

Updated on Aug 27, 2022 08:06 PM IST
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కోసం  కార్తి (Karthi) తొలిసారి పాట పాడారు
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కోసం కార్తి (Karthi) తొలిసారి పాట పాడారు

శర్వానంద్ (Sharwanand) కోసం కార్తి (Karthi) ఓ పాట పాడాడు. ఒకే ఒక జీవితం సినిమా కోసం పాడిన ప్రమోషనల్ సాంగ్ ఇది. శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో రీతూవర్మ కథానాయిక. అమల ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి శ్రీ కార్తీక్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మాతలు. ఈ సినిమాని సెప్టెంబరు 9న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార చిత్రాన్ని కంపోజ్‌ చేశారు. ఈపాటని తమిళ నటుడు కార్తి ఆలపించారు. ‘మారిపోయే’ అంటూ సాగే గీతమిది. జేక్స్‌ బిజోయ్‌ సంగీతాన్ని అందించారు. కృష్ణ చైతన్య రాశారు.

శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కోసం  కార్తి (Karthi) తొలిసారి పాట పాడారు

కార్తి స్పెషల్​ సాంగ్​..

 మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటివలే విడుదలైన 'ఒకటే కదా' పాట సూపర్ హిట్ అయ్యింది. అన్నీ మ్యూజిక్ వేదికలపై ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి 'మారిపోయే' అనే పాటని విడుదల చేశారు. ఈ పాటలో హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. 'నేనే పాడుతున్నా' అంటూ తనదైన శైలిలో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు కార్తీ.

ఈ సినిమా కోసం కార్తి (Karthi) పాడిన పాట ప్రత్యేక ఆకర్షణ. కార్తి ఈ పాటని చాలా హుషారుగా పాడారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకూ, పాటలకూ మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అమ్మ పాట ట్రెండింగ్‌లో నిలిచింది. తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రం కోసం సంభాషణలు రాశారు.  ప్రతీమాటా ఆకట్టుకొనేలా ఉంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు నటించారు. శర్వానంద్​(Sharwanand) 30వ చిత్రంగా ఈ సినిమా విడుదల కానుంది.

Read More : కార్తి (Karthi) హీరోగా నటించిన ‘విరుమన్’ నిర్మాతలకు డైమండ్ బ్రాస్‌లెట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!