'ఇద్దరు మామలను చూస్తూ పెరిగా..' పవన్ కల్యాణ్ 'బద్రి' (Badri) రీమేక్ చేయాలని ఉంది: వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej)

Updated on Sep 03, 2022 12:09 PM IST
రు మామయ్య (Megastar Chiranjeevi), కళ్యాణ్ మామ సినిమాలని రీమేక్ చేయడమంటే సాహసమే. కళ్యాణ్ మామ సినిమా బద్రిని (Badri) రీమేక్ చేయాలని ఉంది.
రు మామయ్య (Megastar Chiranjeevi), కళ్యాణ్ మామ సినిమాలని రీమేక్ చేయడమంటే సాహసమే. కళ్యాణ్ మామ సినిమా బద్రిని (Badri) రీమేక్ చేయాలని ఉంది.

‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు టాలీవుడ్ యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vashnav Tej). తొలి సినిమా తోనే ఎంతో పరిణితితో కూడిన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ హీరో. రెండో చిత్రం 'కొండ పొలం'లోనూ కమర్షియల్‌ జోలికి వెళ్లకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకొని తన ఎంపిక ఎలా ఉంటుందో మరోసారి చాటి చెప్పాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.   

వైష్ణవ్‌ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం వైష్ణవ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"ఇద్దరి మామయ్యాల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ళ సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. చిరు మామయ్య (Megastar Chiranjeevi), కళ్యాణ్ మామ సినిమాలని రీమేక్ చేయడమంటే సాహసమే. కానీ కథ మంచిగా కుదిరి, డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయగలిగితే నాకు బాగా ఇష్టమైన కళ్యాణ్ మామ సినిమా బద్రిని (Badri) రీమేక్ చేయాలని ఉంది" అని తెలిపాడు. 

దీంతో వైష్ణవ తేజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కల్యాణ్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా 'బద్రి' సినిమా నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ రేంజ్ మారిపోయింది.

'రంగరంగా వైభవంగా' చిత్రానికి గిరీశయ్య దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan Birthday) బర్త్ డే సందర్భంగా రిలీజ్‌ కాబోతున్న సినిమా కావడంతో అందరిలోనూ అటెన్షన్‌ నెలకొంది. మరి తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్‌ తేజ్‌ కెరీర్‌ను ‘రంగ రంగ వైభవంగా’ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Read More: Vaishnav Tej: 'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజ్.. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ కెమిస్ట్రీ అదుర్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!