కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటిస్తున్న ఇండియన్‌2 సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్న శంకర్‌‌!

Updated on Aug 19, 2022 11:36 PM IST
స్టార్ యాక్టర్లు లేకుండా కమల్‌ హాసన్ (Kamal Haasan) ఇండియన్‌2 సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను డైరెక్టర్‌‌ శంకర్ ప్లాన్ చేశారని టాక్.
స్టార్ యాక్టర్లు లేకుండా కమల్‌ హాసన్ (Kamal Haasan) ఇండియన్‌2 సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను డైరెక్టర్‌‌ శంకర్ ప్లాన్ చేశారని టాక్.

లోకనాయకుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) అభిమానులతోపాటు మూవీ ల‌వ‌ర్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. భారతీయుడు సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ‌ద్దలు కొట్టిన క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్ మ‌ళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు సందడి చేస్తుందా? అని క్యూరియాసిటీతో ఉన్నారు సినీ జ‌నాలు. తాజాగా ఇండియన్ 2 షూటింగ్ ప్లాన్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇండియ‌న్ 2 చిత్రీక‌ర‌ణ‌ను ఆగ‌స్టు 24 నుంచి స్టార్ట్‌ చేయాల‌ని ఫిక్స్ అయ్యారట దర్శకుడు శంక‌ర్‌. ఈ స్టార్ డైరెక్టర్ చిన్న షెడ్యూల్ ఒక‌టి ప్లాన్ చేశారని ఇన్‌సైడ్ టాక్‌. ఈ షెడ్యూల్ షూట్‌లో మెయిన్ యాక్టర్లు ఉండ‌బోరని  తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియ‌ల్ అప్‌డేట్ రాలేదు.

స్టార్ యాక్టర్లు లేకుండా కమల్‌ హాసన్ (Kamal Haasan) ఇండియన్‌2 సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను డైరెక్టర్‌‌ శంకర్ ప్లాన్ చేశారని టాక్.

70 శాతం కంప్లీట్..

లైకా ప్రొడ‌క్షన్స్ నిర్మిస్తున్న ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నారు. సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బాబీ సింహా, స‌ముద్రఖ‌ని ఇత‌ర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

కమల్‌ హాసన్ (Kamal Haasan) హీరోగా నటిస్తున్న ఇండియన్‌2 సినిమాకి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీత ద‌ర్శకుడు. ప్రస్తుతం రాంచ‌ర‌ణ్ హీరోగా నటిస్తున్న ఆర్‌సీ 15 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు శంక‌ర్‌. తాను షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్టు ఇప్పటికే కాజ‌ల్ నెట్టింట్లో అప్‌డేట్ ఇచ్చారు కూడా.

Read More : Indian 2: కమల్ హాసన్ 'భారతీయుడు 2' సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!