RC15: ‘ఆర్‌సీ15’ షూటింగ్‌పై చరణ్​ (Ram Charan) మరో అప్‌డేట్.. సాంగ్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్..!

Updated on Nov 30, 2022 12:38 PM IST
RC15: సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన పాటను దర్శకుడు శంకర్, కెమెరామెన్ తిరు అద్భుతంగా చిత్రీకరించారని చరణ్ (Ram Charan)​ తెలిపారు
RC15: సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన పాటను దర్శకుడు శంకర్, కెమెరామెన్ తిరు అద్భుతంగా చిత్రీకరించారని చరణ్ (Ram Charan)​ తెలిపారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ (Ram Charan)​ సినిమా సినిమాకు తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’ చిత్రం నుంచి ఆయన వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. అంతకుముందు వరకు ఎన్ని హిట్లున్నా.. నటుడిగా ఆయనలోని అసలైన సత్తాను మాత్రం ‘రంగస్థలం’ మూవీయే బయటపెట్టింది. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడనే పేరున్న చరణ్​.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలనని ఆ చిత్రంతో నిరూపించుకున్నారు. 

‘రంగస్థలం’ తర్వాత వచ్చిన ‘వినయ విధేయ రామ’ నిరాశపర్చినప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’తో మళ్లీ తానేంటో చరణ్​ ప్రూవ్ చేశారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒకవైపు బ్రిటిషర్లకు విధేయతను చూపుతూనే.. మరోవైపు స్వాత్రంత్ర్య కాంక్షతో రగిలిపోయే పోరాట యోధుడిగా, స్నేహం కోసం ప్రాణం ఇచ్చే మిత్రుడిగా సున్నితమైన ఎమోషన్స్‌ను పలికించడంలో ఆయన ఫుల్ సక్సెస్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్​ ఇంటెన్సివ్ యాక్టింగ్‌కు టాలీవుడ్‌తోపాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. దీంతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపును సంపాదించారు. 

ఇకపోతే, చరణ్​ ప్రస్తుతం కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్‌తో ఓ చిత్రం చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘ఆర్‌సీ15’ (RC15) అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇటీవలే ఈ మూవీ టీమ్ న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడ దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో ఓ పాటను చిత్రీకరించేందుకు శంకర్ ప్లాన్ చేశారట. దీని గురించి చెర్రీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ షూట్ పూర్తయ్యిందని ఆయన తెలిపారు. 

న్యూజిలాండ్‌లో ప్లాన్ చేసిన సాంగ్ షూటింగ్ పూర్తయ్యిందని చరణ్​ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాటలోని విజువల్స్ అద్భుతంగా వచ్చాయని చెబుతూ డైరెక్టర్ శంకర్, సినిమాటోగ్రఫర్ తిరును చెర్రీ మెచ్చుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఎప్పటిలాగే ఈ పాటను కూడా చాలా బాగా కంపోజ్ చేశారని.. ఇందులో కియారా అద్వానీ బాగా యాక్ట్ చేశారని ప్రశంసించారు. ఈ సాంగ్‌లో తాను మరింత అందంగా కనిపించేందుకు సహకరించిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌కు చెర్రీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మూవీ యూనిట్‌తో కలసి దిగిన ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి, చెర్రీ కెరీర్‌లో అతిపెద్ద చిత్రంగా చెబుతున్న ‘ఆర్‌సీ15’ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Read more: Kriti Sanon: ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్ కృతి సనన్.. బాలీవుడ్ బ్యూటీ ఏమన్నారంటే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!