విజయవంతంగా 75 రోజులు పూర్తి చేసుకున్న కమల్‌ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’ .. ట్రెండింగ్‌లో #75DaysofVikram

Updated on Aug 17, 2022 05:16 PM IST
కమల్‌ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’  సినిమా వంద రోజుల దిశగా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది
కమల్‌ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’ సినిమా వంద రోజుల దిశగా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్‌లో నటించిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో మరోసారి ఈ సినిమా ద్వారా చూపించారు లోకనాయకుడు కమల్ హాసన్.

రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే రికార్డులు నమోదు చేస్తూ వార్తల్లో నిలిచింది 'విక్రమ్‌'. కమల్ సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన 'విక్రమ్' సినిమా థియేటర్లలో విజయవంతంగా 75 రోజులు పూర్తి చేసుకుంది.

కమల్‌ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’  సినిమా వంద రోజుల దిశగా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది

ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌...

ఇటీవలే రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్‌నేషనల్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను తెలియజేసింది. 'భారతీయ సినిమా.. #75DaysofVikram హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ.. కౌంటింగ్' అని ట్వీట్ చేసింది. సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'విక్రమ్' ఈ అరుదైన రికార్డును చేరుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి.

ఇప్పటివరకు ఉన్న అప్‌డేట్ ప్రకారం 'విక్రమ్‌' సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.400 కోట్ల మార్కును దాటినట్టు అంచనా వేస్తున్నారు.

కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా నటించిన విక్రమ్ సినిమా ఒక్క తమిళనాడులోనే 17 రోజుల్లో.. రూ.155 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. జూలై 8న డిస్నీ + హాట్‌ స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైంది 'విక్రమ్‌'. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు.

Read More : Vikram 2 ( విక్రమ్ 2) : కమల్ హాసన్ (Kamal Haasan) ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ ! ఈ టాప్ 10 విశేషాలు మీకోసమే

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!