Man Of Masses NTR: బాద్‍షా (Baadshah) రీ రిలీజ్ - ఎన్టీఆర్ (Jr NTR) డైలాగులకు దద్దరిల్లిన థియేటర్లు

Updated on Nov 19, 2022 05:58 PM IST
ఎన్టీఆర్‌  (Jr NTR) కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన 'బాద్‌షా' సినిమా విడుదలై 22 సంవత్సరాలు అయిన సందర్భంగా  రీ రిలీజ్ చేశారు. 
ఎన్టీఆర్‌ (Jr NTR) కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన 'బాద్‌షా' సినిమా విడుదలై 22 సంవత్సరాలు అయిన సందర్భంగా  రీ రిలీజ్ చేశారు. 

Man Of Masses NTR:  "బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది" అంటూ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) 'బాద్‌షా' సినిమాలో చెప్పిన డైలాగులు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఎన్టీఆర్ అంతకు ముందు నటించిన సినిమాలకు రాని కలెక్షన్లు 'బాద్‍షా' సినిమా రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. బ్రహ్మానందం కామెడీకి సైమా అవార్డు లభించడం విశేషం.2014 జపాన్‌లో జరిగిన ఒకాసా ఏషియన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఎన్టీఆర్‌కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన 'బాద్‌షా' సినిమా విడుదలై 22 సంవత్సరాలు అయిన సందర్భంగా  రీ రిలీజ్ చేశారు.  'బాద్‌షా' సినిమా గురించిన ఆసక్తికరమైన విశేషాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం.

ఎన్టీఆర్‌  (Jr NTR)

Baadshah: బాద్‍షా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు

కథ

బాద్‍షా (ఎన్టీఆర్) (Jr NTR) తండ్రి ఓ అంతర్జాతీయ నేరస్థుడు సాధు భాయ్ దగ్గర పనిచేస్తుంటాడు.  సాధు భాయ్‌తో బాద్‌షాకు గొడవ జరుగుతుంది. సాధు భాయ్ భారత్‌లో ఉగ్ర దాడులు జరిపేందుకు కుట్ర చేస్తాడు. ఆ కుట్రలను బాద్‌షా తన తెలివితేటలతో పాటు జానకి (కాజల్ అగర్వాల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా (నాజర్) సహాయంతో అడ్డుకుంటాడు. జై కృష్ణ సింహా కుటుంబం చాలా పెద్దది. ఆ కుటుంబంలో జై కృష్ణ సింహా చెల్లెలు పద్మనాభ సింహా (బ్రహ్మానందం)ను బాద్‌షా ఎలా రెచ్చగొడతాడు.. ఆ తరువాత జానకిని ఎలా పెళ్లి చేసుకుంటానే కథతో ఈ సినిమా సాగుతుంది.

ఎన్టీఆర్ నటన

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడ్డారు. కొత్త గెటప్‌లో ఎన్టీఆర్ బాద్‌షా సినిమాలో కనిపించి థియేటర్లను షేక్ చేశారు. ఫైట్స్, డైలాగులు, కామెడీతో ఎన్టీఆర్ అదరగొట్టారు.

దర్శకత్వం ఎలా సాగిందంటే..

నీకోసం సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా మారిన శ్రీను వైట్ల బాద్‌షా సినిమాను తెరకెక్కించారు. మాస్, కామెడీ సినిమాగా బాద్‌షాను చిత్రీకరించారు. యాక్షన్ సీన్లతో పాటు పొట్ట చెక్కలయ్యే కామెడీ సీన్లను అద్భుతంగా తీశారు శ్రీను వైట్ల. శ్రీను వైట్ల దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే వర్క్ కూడా చేశారు. బాద్‍షా సినిమా కథను గోపి మోహన్, కోన వెంకట్‌లు రాశారు.

సైమా అవార్డు

బాద్‍షా సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాకుగానూ ఉత్తమ కమెడియన్‌గా బ్రహ్మానందం సైమా అవార్డును అందుకున్నారు.

ఎన్టీఆర్‌  (Jr NTR)

మహేష్ వాయిస్

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు మహేష్ బాబు తన వాయిస్ అందించారు. మహేష్ బాబు చెప్పిన డైలాగులు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. 

నటీనటులు

జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, నాజర్, ప్రకాశ్ రాజ్, నవదీప్, సుహాసిని, మీనాక్షి దీక్షిత్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ముకేష్ రిషి, తాగుబోతు రమేష్ నటించారు.

నిర్మాత

బాద్‌షా (Baadshah) చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ సినిమాను రూ.55 కోట్లతో రూపొందించారు. బాద్‌షా ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్లను వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. 

సంగీతం

శ్రీను వైట్ల తెరకెక్కించిన దూకుడు సినిమా తరువాత తమన్ సంగీతం అందించిన సినిమా బాద్‌షా. తమన్ స్వరపరిచిన పాటలు అప్పట్లో మోత మోగాయి.

స్పెషల్ పాటలు ప్రత్యేకం

బాద్‌షా టైటిల్ పాటలో మీనాక్షి దీక్షిత్ నటించారు. వెల్కమ్ కనకం పాటలో నికోల్ అమీ మాడెల్ నటించారు. 

ఎన్టీఆర్‌  (Jr NTR)

ఫేమస్ డైలాగులు

  • బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
  • బాద్‌షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‌గుంటది
  • పిచ్ నీదైనా మ్యాచ్ నాదే
  • ఎన్టీఆర్‌ను కొనగలిగే మగాడు ఇప్పటివరకు లేడు.. ఇకపై రాడు
  • బ్రతకాలంటే బాద్‍షా కింద ఉండాలి, చావాలంటే బాద్‍షా ముందుండాలి

Read More: Tollywood: టాలీవుడ్‌లో సొంత జెట్ విమానాలు ఉన్న హీరోలు ఎవరో మీకు తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!