‘ఆర్‌సీ15’ (RC15) కోసం స్టైలిష్ మేకవర్.. రామ్ చరణ్ (Ram Charan) కొత్త హెయిర్ స్టైల్ అదిరిపోయిందిగా..!

Updated on Nov 24, 2022 03:38 PM IST
లాంగ్ హెయిర్‌లో రామ్ చరణ్ (Ram Charan) లుక్ అదిరిపోయింది. ఈ లుక్‌ను అందించినందుకు స్టైలిష్ట్ అలీమ్‌కు చెర్రీ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు
లాంగ్ హెయిర్‌లో రామ్ చరణ్ (Ram Charan) లుక్ అదిరిపోయింది. ఈ లుక్‌ను అందించినందుకు స్టైలిష్ట్ అలీమ్‌కు చెర్రీ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమాల అప్‌డేట్స్ కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన చెర్రీ.. ప్రస్తుతం ‘ఆర్‌సీ15’ (RC15)లో నటిస్తున్నారు. కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీ కోసం చరణ్ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందుకోసం బాడీతోపాటు కొత్త లుక్స్‌నూ ప్రయత్నిస్తున్నారు.  

‘ఆర్‌సీ15’ షూటింగ్ కోసం ఇటీవలే శంకర్, చరణ్ అండ్ మూవీ టీమ్ న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో ఓ పాట చిత్రీకరిస్తున్నారని సమాచారం. అయితే అక్కడ అలా షూటింగ్ కోసం వెళ్లినా, గ్యాప్ దొరికినా.. వెకేషన్లకు వెళ్లినా కూడా వర్కౌట్లకు మాత్రం చరణ్ డుమ్మా కొట్టడం లేదు. ఫిట్‌నెస్ చేస్తున్న వీడియోను చరణ్​ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్​ తన టీమ్‌తో కలసి చేసిన అల్లరి, వర్కౌట్లు మామూలుగా వైరల్ కావడం లేదు. చరణ్​ క్రమశిక్షణ, సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధతను చూసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.  

RC15: ‘ఆర్‌సీ15’ షూటింగ్ కోసం ఇటీవలే శంకర్, చరణ్ అండ్ మూవీ టీమ్ న్యూజిలాండ్ వెళ్లారు

‘ఆర్‌సీ15’లో చరణ్ బాడీ, న్యూ లుక్స్‌తో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ కోసం చెర్రీ న్యూ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్ రామ్ చరణ్ కోసం సరికొత్త హెయిర్ స్టైల్‌ను అందించారు. ఈ ఫొటోలను స్వయంగా అలీమ్ షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో లాంగ్ హెయిర్‌లో చెర్రీ లుక్ అదిరిపోయింది. ఇలాంటి అందమైన లుక్‌ను అందించినందుకు అలీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. వెంటవెంటనే స్టైలిష్ లుక్స్‌లో తమ అభిమాన హీరో కనువిందు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇకపోతే, ‘ఆర్‌సీ15’ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ డైరెక్టర్ శంకర్ వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతోందని వినికిడి. ఇటు చెర్రీ మూవీతోపాటు అటు కమల్‌తో ‘ఇండియన్ 2’ను ఆయన ఏకకాలంలో చిత్రీకరిస్తుండటంతో లేట్ అవుతోందని తెలుస్తోంది. ఈ కారణంతోనే కొద్దిరోజులు ‘ఆర్‌సీ15’ షూటింగ్ కూడా ఆగిపోయిందని సమాచారం. ఇప్పుడు న్యూజిలాండ్ షెడ్యూల్‌తో చిత్రీకరణలో వేగం పెరిగిందని.. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మెగా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

Read more: Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన ఆమె మేనేజర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!