Indian 2: కమల్ హాసన్ 'భారతీయుడు 2' సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Updated on Aug 06, 2022 02:24 PM IST
కాజల్‌ స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన దీపికా పదుకొనె (Deepika Padukone), కత్రీనా కైఫ్‌ (Katrina Kaif) పేర్లను పరిశీలిస్తున్నారట. 
కాజల్‌ స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన దీపికా పదుకొనె (Deepika Padukone), కత్రీనా కైఫ్‌ (Katrina Kaif) పేర్లను పరిశీలిస్తున్నారట. 

కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లో  కమల్ హాసన్ (Kaman haasan) హీరోగా, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న  సినిమా 'భారతీయుడు 2' (Indian 2). ఈ సినిమాలో ప్రముఖ నటుడు సిద్దార్థ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అప్పట్లో కమలహాసన్‌తో చేసిన ఈ సినిమా ఫొటోషూట్‌, చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. అదే జోరులో సినిమా షూటింగ్‌ను సైతం ప్రారంభించారు నిర్మాతలు. అయితే, ఈ సినిమా షూటింగ్‌కి ప్రతీసారి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. 

అప్పట్లో సెట్లో ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనతో కోలీవుడ్‌తో పాటు, మిగతా సినీ పరిశ్రమలు కూడా ఉలిక్కిపడ్డాయి. అనంతరం ఈ సినిమాలో కమెడియన్‌గా నటిస్తున్న వివేక్‌ హఠాన్మరణం చెందడం.. ఆ తరువాత దర్శకుడికి, లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) సంస్థకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం.. ఇలా ఎన్నో రకాల అడ్డంకులు సినిమాని ప్రభావితం చేశాయి. 

కత్రినా కైఫ్, దీపికా పదుకొణె (Katrina Kaif, Deepika Padukone)

ఒకానొక సందర్భంలో శంకర్ ప్రాజెక్టు మీద ఆసక్తి చూపించడం లేదని, లైకా సంస్థ కోర్టుకు కూడా వెళ్లింది. ఇదే క్రమంలో దర్శకుడికి, నిర్మాతలకి మధ్య  సామరస్యపూర్వక చర్చలు జరిగినా కూడా.. అవి ఫలించకపోవడంతో శంకర్‌ (Director Shankar).. ఆర్‌సీ15 (RC 15) మూవీ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాడు. కానీ ఎట్టకేలకు ఇటీవలే 'ఇండియన్ 2' సినిమాకి సంబంధించిన సమస్యలు, విభేదాలు సద్దుమణగడంతో షూటింగ్‌‌ను మళ్లీ ప్రారంభించే ఆలోచనలో ఉంది చిత్ర బృందం.
 
అయితే ఈ సినిమాకు ప్రస్తుతం మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్‌ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇటీవలే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్‌ వేటలో పడిందట. కాజల్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన దీపికా పదుకొనె (Deepika Padukone), కత్రీనా కైఫ్‌ (Katrina Kaif) పేర్లను పరిశీలిస్తున్నారట. 

అంతేకాదు ఇటీవలే ఈ కథానాయికలతో మూవీ టీం సంప్రదింపులు కూడా జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉందని వినికిడి. మరి "ఇండియన్ 2"లో ఎవరు హీరోయిన్‌గా ఖరారు అవుతారో? షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Read More: శంక‌రా మ‌జాకా!!!.. ఒక‌టి కాదు రెండు సినిమాలు ఒకేసారి తెర‌కెక్కిస్తారా?.

కత్రినా కైఫ్, దీపికా పదుకొణె (Katrina Kaif, Deepika Padukone)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!