కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఇండియ‌న్ 2 షూటింగ్‌ ఎప్పటి నుంచి అంటే! క‌న్ఫమ్ చేసిన కాజ‌ల్

Updated on Aug 05, 2022 10:30 AM IST
భారతీయుడు సినిమా షూటింగ్‌లో కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్
భారతీయుడు సినిమా షూటింగ్‌లో కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్

క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan), శంక‌ర్ కాంబినేష‌న్ అంటే బాక్సాపీస్ వ‌ద్ద ఎక్స్‌పెక్టేష‌న్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. ఈ ఇద్దరూ మ‌రోసారి ఇండియన్ 2 సినిమాతో ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కాగా షూటింగ్ మొద‌లై చాలా సంవత్సరాలు గడిచింది. అయితే చాలాకాలం నుంచి షూటింగ్ ఆగిపోయింది. భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ సెట్స్‌పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై మ‌రో తాజా అప్‌డేట్ తెర‌పైకి వ‌చ్చింది.

అయితే భారతీయుడు సినిమా గురించి మరో వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. శంకర్‌‌, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ఇండియన్‌2 సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌‌ 13వ తేదీన స్టార్ట్‌ కానుందని సమాచారం. ఈ సినిమాలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ కోసం ఎంపికైన కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సెషన్‌లో ఇండియన్‌2 సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌పై లీక్ ఇచ్చారు కాజల్.

భారతీయుడు సినిమా షూటింగ్‌లో కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్

ఆర్‌‌సీ 15 షూటింగ్‌లో బిజీగా..

ఇండియన్‌2 సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యింది.  లైకా ప్రొడ‌క్షన్స్ సంస్ధ నిర్మిస్తున్న ఇండియన్‌2 సినిమాతో కాజల్ (తల్లి అయిన తర్వాత) మరోసారి వెండి తెరపై కనిపించనున్నారు. డైరెక్టర్ శంక‌ర్ ప్రస్తుతం రాంచరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఆర్‌సీ 15 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్దార్థ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బాబీ సింహా, స‌ముద్రఖ‌ని కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. శంక‌ర్‌ – క‌మ‌ల్ (Kamal Haasan) కాంబోలో వ‌చ్చిన భార‌తీయుడు బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డమే కాదు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌‌గా నిలిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఇండియన్ 2పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

Read More : కమల్‌హాసన్ (Kamal Haasan) 'విక్రమ్‌' సినిమా మేకింగ్ వీడియోకి కూడా తగ్గని క్రేజ్.. వీడియో వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!