రామ్‌చ‌ర‌ణ్ 16వ (RamCharan16) సినిమాకు దర్శకుడు కన్ఫమ్.. ఎన్టీఆర్ (NTR) కథతో బుచ్చిబాబు నెక్ట్స్ సినిమా..?

Updated on Nov 28, 2022 12:56 PM IST
రామ్‌చ‌ర‌ణ్ 16(RC16) సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా (BuchiBabu Sana) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.
రామ్‌చ‌ర‌ణ్ 16(RC16) సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా (BuchiBabu Sana) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'RC15' లో(వర్కింగ్ టైటిల్) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా,  ఎస్ జె సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. 

'RC15'లో హీరోయిన్ అంజలి, సునీల్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా, సంచలన సంగీత దర్శకుడు తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. 

ఇదిలా ఉంటే.. రామ్‌చ‌ర‌ణ్ 16వ (RC16) సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ ప‌తాకాల‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను నిర్మించ‌బోతున్నారు.

తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతోంది. కొన్నిసార్లు తిరుగుబాటు అవ‌స‌రం అంటూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్‌ ఆస‌క్తిని పంచుతోంది. ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో పాన్ ఇండియ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు తెలిపారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు స‌మాచారం. క‌థానాయిక‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే, యంగ్ టైగన్ ఎన్టీఆర్ (Junior NTR)తో బుచ్చి బాబు సినిమా ఉంటుంద‌ని అప్పట్లో ప్ర‌చారం జ‌రిగింది. 'పెద్ది' అనే క‌థను సిద్దం చేసినట్లు కూడా వార్తలు అందాయి. కానీ, ఆ ప్రాజెక్టు… ముందుకు క‌ద‌ల్లేదు. వెంటనే ఎన్టీఆర్.. కొర‌టాల శివ సినిమాని ఓకే చేయ‌డం వ‌ల్ల‌… బుచ్చి బాబు క‌థ‌ని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. ఆ త‌ర‌వాత బుచ్చి బాబు.. చ‌ర‌ణ్‌కి ట‌చ్‌లోకి వెళ్లాడు. 

Read More: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవరు.. ట్రెండ్ సెట్ చేస్తారు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!