Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father) చిత్రం : టాప్ 10 ఆసక్తికర విశేషాలివే
'గాడ్ ఫాదర్'.. (God Father) ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. అక్టోబర్ 5వ తేదిన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై మెగాస్టార్ (Megastar) అభిమానులకు బాగానే అంచనాలు ఉన్నాయి. అంతకు మించి భారీ స్టార్ కాస్టింగ్‌తో ఈ చిత్రం ఇప్పటికే వార్తలలో నిలిచింది. సల్మాన్ ఖాన్, నయనతార, సముద్రఖని, సత్యదేవ్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. మలయాళ చిత్రం 'లూసిఫర్'కు (Luficer) రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం
తొలుత 'సాహో' డైరెక్టర్‌తో సినిమా ప్లాన్
'గాడ్ ఫాదర్' (God Father) సినిమాను తొలుత 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుజీత్‌తో ప్లాన్ చేయాలని భావించారట. కానీ ఆ ప్లాన్‌కు ఎందుకో మధ్యలోనే బ్రేక్ పడింది. సెప్టెంబర్ 2020 నెలలో ఈ ప్రాజెక్టు నుండి సుజీత్ బయటకు వచ్చేశారు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో
అలాగే 'గాడ్ ఫాదర్' (God Father) చిత్రాన్ని వి.వి. వినాయక్ దర్శకత్వంలో కూడా తెరకెక్కిస్తే బాగుంటుందని చిరంజీవి భావించారట. అయితే ఈ ఐడియా కూడా కార్యరూపం దాల్చలేదు. వి.వి.వినాయక్ గతంలో చిరంజీవితో 'ఠాగూర్' సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అలాగే ఖైదీ నెంబర్ 150 చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.
ఆఖరికి మోహన్ రాజాకి ఛాన్స్
ఎడిటర్ మోహన్ గతంలో చిరంజీవితో 'హిట్లర్' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని నిర్మించారు. ఆయన తనయుడు మోహన్ రాజా (Mohan Raja) మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా 'గాడ్ ఫాదర్'ను తెరకెక్కించడం విశేషం. మోహన్ రాజాకు తెలుగులో ఇదే తొలి సినిమా కాదు. గతంలో ఆయన తెలుగులో 'హనుమాన్ జంక్షన్' సినిమాను తెరకెక్కించారు.
చిరంజీవి తల్లిగా గంగవ్వ
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో చిరంజీవి తల్లిగా గంగవ్వ (Gangavva) నటిస్తోంది. మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన గంగవ్వ గతంలో బిగ్ బాస్ తెలుగు షోలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్‌కు చిన్న పాత్ర
'గాడ్ ఫాదర్' సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా చిన్న పాత్ర పోషిస్తున్నారు. పూరీ ఎన్నో సంవత్సరాల నుండి చిరంజీవితో కలిసి పనిచేయాలని చూస్తున్నారు. కానీ ఆ అవకాశం ఇప్పటికీ రాలేదు. కానీ రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం 'చిరుత'కు దర్శకత్వం వహించింది పూరీ జగన్నాథే కావడం విశేషం
నీరవ్ షా సినిమాటోగ్రఫీ
హిందీలో ధూమ్, ధూమ్ 2, వాంటెడ్ లాంటి సినిమాలకు .. అలాగే తమిళంలో వానమ్, వెట్టై, బిల్లా, పోకిరి, 2.0, సూపర్ డీలక్స్ లాంటి సినిమాలకు ఛాయా గ్రహణ బాధ్యతలు నిర్వర్తించిన నీరవ్ షా 'గాడ్ ఫాదర్' సినిమాకు కూడా సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం.
బిగ్ బిస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ దివికి ఛాన్స్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 లో దివి అనే అమ్మాయి కంటెస్టెంటుగా పాల్గొంది. ఆ సీజన్ ఫైనల్స్‌లో చిరంజీవి మాట్లాడుతూ, దివికి తన తదుపరి సినిమాలో ఛాన్స్ ఇస్తానని తెలిపారు. చెప్పినట్లుగానే ఆమెకు తన 'గాడ్ ఫాదర్' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి
సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్
'గాడ్ ఫాదర్' సినిమాకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పెషల్ ఎట్రాక్షన్. స్పెషల్ ఏజెంట్ అర్మన్ సింగ్ పాత్రలో ఇందులో సల్మాన్ నటిస్తున్నారు. చిత్రమేంటంటే గతంలో సల్మాన్ ఖాన్.. చిరంజీవి నటించిన ఓ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేశారు. చిరు నటించిన స్టాలిన్ సినిమాని సల్మాన్ హిందీలో 'జై హో' పేరుతో రీమేక్ చేశారు.
లక్ష్మీ భూపాల్ డైలాగ్స్
గతంలో చందమామ, నేనే రాజు నేనే మంత్రి, అద్భుతం లాంటి సినిమాలకు సంభాషణలు అందించిన లక్ష్మీ భూపాల్‌కు 'గాడ్ ఫాదర్' చిత్రం ఓ సువర్ణావకాశమే.
'లూసిఫర్' తెలుగులోనూ రిలీజైంది
మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.175 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా 2019 లో తెలుగులో కూడా డబ్ చేయబడింది.
అయితే, ఈ సినిమా సబ్జెక్టుగా బాగా కనెక్ట్ అయిన చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి సంబంధించిన ప్రెస్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, తాము 'లూసిఫర్' సినిమా రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నామని ప్రకటించారు. వీలైతే, ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పృథ్విరాజ్‌కే అవకాశమిస్తామని కూడా తెలిపారు.
ఇవండీ.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన “గాడ్ ఫాదర్“ సినిమా విశేషాలు
Read more: ‘గాడ్‌ఫాదర్’ మాస్ సాంగ్ రిలీజ్... 'థార్ మార్ థక్కర్ మార్' పాటకు ప్రభుదేవా స్టెప్పులు!!