God Father: 'గాడ్‌ఫాద‌ర్‌'లో న‌య‌న‌తార ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. చిరు (Chiranjeevi)కు చెల్లిగా న‌య‌న్ !

Updated on Sep 08, 2022 01:27 PM IST
God Father: చిరంజీవికి చెల్లెలుగా  'గాడ్‌ఫాద‌ర్‌'లో న‌య‌నతార క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించ‌నుంది. 
God Father: చిరంజీవికి చెల్లెలుగా 'గాడ్‌ఫాద‌ర్‌'లో న‌య‌నతార క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించ‌నుంది. 

God Father: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టిస్తున్న సినిమాల్లో 'గాడ్‌ఫాదర్' ప్ర‌త్యేక‌మైంది. మలయాళ చిత్రం 'లూసిఫర్‌'కు రీమేక్‌గా 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది. 'గాడ్‌ఫాద‌ర్‌'లో సాత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార కూడా న‌టించడం విశేషం. ఈ సినిమాలో న‌య‌న‌తార ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవలే మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

చిరు (Chiranjeevi)కు చెల్లిగా న‌య‌న్

'సైరా'లో చిరంజీవి సతీమణిగా న‌టించిన న‌య‌న‌తార‌.. 'గాడ్ ఫాద‌ర్‌'లో ఆయనకు చెల్లెలుగా న‌టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీనియ‌ర్ స్టార్ హీరోల సినిమాల్లో నయన్ సిస్టర్ పాత్రలలో కనిపిస్తున్నారు. 

న‌య‌న్ తన పెళ్లి త‌ర్వాత న‌టించ‌బోయే సినిమాల్లో 'గాడ్ ఫాద‌ర్' ఒక‌టి. ఈ సినిమాలో 'స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్' పాత్ర‌లో న‌య‌న్ న‌టిస్తున్నారు. ఎంతో సింపుల్‌గా న‌య‌న్ ఫ‌స్ట్ లుక్ ఉంది. చిరంజీవికి చెల్లెలుగా న‌య‌నతార క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించ‌నుంది. 

మోహ‌న్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రిలీజ్ అయిన 'లూసిఫ‌ర్' మ‌ల‌యాళంలో బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. మ‌ల‌యాళంలో న‌య‌న‌తార పాత్ర‌లో మంజు వారియ‌ర్ న‌టించారు. ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఇటీవలే త‌న ఫేస్ బుక్‌ పేజీలో న‌య‌న‌తార‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. 'గాడ్‌ఫాద‌ర్' సినిమాలో న‌య‌న‌తార షూటింగ్ షెడ్యూల్ పూర్త‌యింద‌ని తెలిపారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ రెండు త‌మిళ సినిమాల్లోనూ న‌య‌న‌తార న‌టించడం గమనార్హం. 

'గాడ్‌ఫాద‌ర్' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట‌లో చిరంజీవి (Chiranjeevi), సల్మాన్ ఖాన్‌లు కలిసి స్టెప్పులేయ‌నున్నారు. అలాగే నటుడు స‌త్య‌దేవ్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నారు. స్టార్ కొరియోగ్రాఫ‌ర్, దర్శకుడు అయిన ప్ర‌భుదేవా కూడా ఈ సినిమా కోసం కొన్ని డ్యాన్సులు కంపోజ్ చేశారు.

'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీ రైట్స్‌ను, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింద‌ట‌. దాదాపు రూ. 50 కోట్ల‌తో ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను సొంతం చేసుకోనుంద‌ట‌. మెగాస్టార్ చిరు నటించిన 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read More: దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father).. రూమర్లు నమ్మవద్దంటూ నిర్మాత ప్రకటన..!

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!