మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' (God Father) డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ (Netflix)..!

Updated on Sep 20, 2022 10:54 AM IST
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netfilx) భారీ ధరకు 'గాడ్ ఫాదర్' (God Father) డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు సమాచారం.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netfilx) భారీ ధరకు 'గాడ్ ఫాదర్' (God Father) డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు సమాచారం.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' (God Father). మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ (Lucifer) సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌ తో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్బీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

దాదాపు 20 ఏళ్ల తర్వాత మోహన్ రాజా (Director Mohan Raja).. చిరంజీవి సినిమా ద్వారా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. ‘హనుమాన్ జంక్షన్’తో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు దర్శకుడు మోహన్ రాజా. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. 

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను (Godfather Promotions) గ్రాండ్‌గా ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలో క్రేజీ అప్డేట్స్ ను విడుదల చేస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.

మరికొన్ని రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఓటీటీ రైట్స్ (Godfather OTT Rights) ను కూడా మేకర్స్ విక్రయించినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netfilx) భారీ ధరకు చిత్ర డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు థియేటర్లలో విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేలా నిర్మాతలకు, సదరు ఓటీటీ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ సినిమాలో సత్యదేవ్ (Actor Satyadev) కీలక పాత్రలో నటిస్తుండగా.. పూరీ జగన్నాథ్, సునీల్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, ఇటీవల ఈ సినిమా నుంచి నయనతార, సత్యదేవ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశారు. 

ఇక, తాజాగా విడుదలైన మాస్ సాంగ్ ‘తార్ మార్ తక్కర్ మార్’కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కలిసి చిందులేయడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మెగాస్టార్లను చూడటం పట్ల అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father).. రూమర్లు నమ్మవద్దంటూ నిర్మాత ప్రకటన..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!