God Father: ‘గాడ్‌ఫాద‌ర్’ మాస్ సాంగ్ రిలీజ్... 'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' పాట‌కు ప్ర‌భుదేవా స్టెప్పులు!!

Updated on Sep 13, 2022 08:57 PM IST
God Father: 'గాడ్‌ఫాద‌ర్' సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌లో చిరంజీవి  స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి స్టెప్పులేశారు.
God Father: 'గాడ్‌ఫాద‌ర్' సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌లో చిరంజీవి స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి స్టెప్పులేశారు.

God Father: 'ఆచార్య' ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  సినిమాల‌పై ఫోక‌స్ మ‌రింత పెంచారు. కోలీవుడ్ డైరెక్ట‌ర్‌ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి 'గాడ్‌ఫాద‌ర్' సినిమాలో న‌టిస్తున్నారు. 'గాడ్‌ఫాద‌ర్' సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను మేక‌ర్స్ ఈ రోజే రిలీజ్ చేశారు. ఈ పాట‌లో చిరంజీవి  స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి స్టెప్పులేశారు. మాస్ పాట‌గా 'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' పాట అల‌రించింది. ఫుల్ సాంగ్‌ను సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

ప్రోమో అదుర్స్

'గాడ్‌ఫాద‌ర్' సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట‌లో చిరంజీవి (Chiranjeevi), సల్మాన్ ఖాన్‌లు కలిసి డ్యాన్స్ చేశారు.  స్టార్ కొరియోగ్రాఫ‌ర్, దర్శకుడు ప్ర‌భుదేవా కంపోజ్ చేసిన స్టెప్పులు అదిరిపోయాయట. 'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' పాట ప్రోమోలో చిరు, స‌ల్మాన్‌ల కాస్టూమ్స్ కూడా వైవిధ్యంగా ఉన్నాయి. 'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' పాట‌ను అనంత శ్రీరామ్ రాశారు. శ్రేయ ఘోషాల్ ఆల‌పించారు. 'గాడ్‌ఫాద‌ర్' సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించారు

ద‌స‌రా పండుగ‌కు రిలీజ్

'గాడ్‌ఫాద‌ర్‌'లో సాత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార కూడా న‌టిస్తున్నారు.  అలాగే నటుడు స‌త్య‌దేవ్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను మేక‌ర్స్ ఇటీవ‌లే రిలీజ్ చేశారు. చిరంజీవి భార్య‌ కొణిదెల సురేఖ 'గాడ్‌ఫాద‌ర్' సినిమాను సమర్పిస్తున్నారు.  ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై  ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  'గాడ్ ఫాదర్'  అక్టోబర్ 5 తేదీన దసరా కానుకగా విడుదల కానుంది.

Read More: దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father).. రూమర్లు నమ్మవద్దంటూ నిర్మాత ప్రకటన..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!