హీరోగా రవితేజ (Ravi Teja) తమ్ముడి కొడుకు ఎంట్రీ.. దర్శకుడు రమేష్ వర్మపైనే భారం వేసిన మాస్ మహరాజా!
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలో అడుగుపెట్టి ఎంతో కష్టపడి తన ప్రతిభతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja). ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుని హీరోగా కెరీర్‌లో దూసుకుపోతున్నారు. హీరో మాస్ మహారాజా రవితేజ మూవీస్ థియేటర్లోకి వచ్చాయంటే ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేయాల్సిందే.
ఇక రవితేజ తరువాత అతని తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. కానీ దానిపై క్లారిటీ లేదు. అయితే అంతకంటే ముందు రవితేజ తమ్ముడు కొడుకు మాధవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మాధవన్‌ను ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
లాక్‌డౌన్‌తోనే ఆలస్యం..
కానీ సరైన టైమ్ దొరకలేదు. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోవడంతో మాధవన్ ఎంట్రీకి ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండడంతో మాధవన్‌ని హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాడట రవితేజ.
రమేష్ వర్మ డైరెక్షన్‌లో మాధవన్ హీరోగా సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో రవితేజతో రెండు సినిమాలు చేసిన రమేష్ వర్మ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా రవితేజ అతని టాలెంట్ చూసి తన తమ్ముడి కొడుకుతో ఎలాగైనా సినిమా తీసి హిట్ కొట్టించాలని చూస్తున్నారు.
దీంతో రమేష్ వర్మ పై పూర్తి బాధ్యతలు పెట్టారని తెలుస్తోంది. కానీ ఈ సినిమాను రమేష్ వర్మనే డైరెక్ట్ చేస్తాడా లేదా ఇంకెవరనేది ఇప్పటివరకు తెలియలేదు. మరి మాధవన్ అయినా హిట్ కొడతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
బాక్సాఫీస్ వద్ద..
ఇక గతంలో.. హీరో రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో 2011లో వచ్చిన ‘వీర’ బాక్సాపీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఈ మూవీ తర్వాత 8 సంవత్సరాల వరకు రమేష్‌కి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. తర్వాత రీమేక్ మూవీతో రమేష్ వర్మ రవితేజ కాంబినేషన్‌లో మళ్లీ స్క్రీన్ పైకి వచ్చారు. 2021లో రవితేజతో ‘ఖిలాడీ’ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా కూడా రవితేజ (Ravi Teja)కు అనుకున్న స్థాయిలో విజయం దొరకలేదనే చెప్పుకోవాలి. హిట్ టాక్ తెచ్చుకున్నా ఎక్కువ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించడంతో బాక్సాపీస్ వద్ద అనుకున్నంతగా వసూళ్లు మాత్రం చేయలేకపోయింది. మరి ఈసారైనా రమేష్ హిట్ కొడతాడో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Read More : రవితేజ (Ravi Teja) రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు సిద్ధం.. నెల రోజుల్లో థియేటర్లలోకి ఎంట్రీ