Raviteja: రవితేజ 'ధమాకా' (Dhamaka) మూవీ నుంచి 'మాస్ రాజా' (Mass Raja) లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Updated on Sep 23, 2022 09:14 PM IST
తాజాగా 'ధమాకా' (Dhamaka) మూవీ నుంచి ‘మాస్‌రాజా’ (Mass Raja) అంటూ సాగే మాస్‌ బీట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.
తాజాగా 'ధమాకా' (Dhamaka) మూవీ నుంచి ‘మాస్‌రాజా’ (Mass Raja) అంటూ సాగే మాస్‌ బీట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Hero Raviteja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా' (Dhamaka). 'డబుల్ ఇంపాక్ట్' అనేది ట్యాగ్ లైన్. త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శకత్వం వ‌హించిన‌ ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడ‌క్షన్‌ పనుల‌లో బిజీగా ఉంది. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ.. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్‌పి బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. 

'ధమాకా' సినిమాలో రవితేజ సరసన 'పెళ్లి సందD' బ్యూటీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌ 21న విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుద‌లైన పోస్టర్‌లు ప్రేక్షకులను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘మాస్‌రాజా’ అంటూ సాగే మాస్‌ బీట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

'బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా.. బీసీ సెంటర్లలో మోగాలి తాలియా..' అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ కు మంచి మాస్ బీట్ ని కంపోజ్ చేయగా.. రవితేజ (Hero Raviteja) ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా సింగర్ నకాస్ అజిజ్ ఎంతో హుషారుగా ఆలపించారు. ఇక, యష్ మాస్టర్ ఈ మాస్ సాంగ్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట థియేటర్లలో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తుందనే భావన కలిగిస్తోంది.

ఇక, రవితేజ ‘క్రాక్’ తో హిట్ కొట్టాడనుకుంటే.. వెంటనే ‘ఖిలాడి’ (Khiladi), ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూపంలో రెండు సాలిడ్ ఫ్లాప్స్ పడ్డాయి. ఇప్పుడు ఆయన చేతిలో ‘ధమాకా!’ (Dhamaka), ‘రావణాసుర’, ‘టైగర్ ‘నాగేశ్వరరావు’ సినిమాలున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

Read More: షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ (Raviteja) 'ధమాకా'మూవీ (Dhamaka).. దీపావళికి రిలీజ్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!