రవితేజ (Ravi Teja) నటించిన ‘రావణాసుర’ సినిమా క్లైమాక్స్ మామూలుగా ఉండదట .. మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు ఇక పండగే !

Updated on Aug 29, 2022 08:17 PM IST
రవితేజ (Ravi Teja)  ఇటీవలే నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం నిర్మాతలతో పాటు అభిమానులకు భారీ నిరాశనే మిగిల్చింది.
రవితేజ (Ravi Teja) ఇటీవలే నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం నిర్మాతలతో పాటు అభిమానులకు భారీ నిరాశనే మిగిల్చింది.

మాస్‌రాజా ర‌వితేజ‌ (Ravi Teja) వ‌రుస‌గా సినిమాల‌ను ఓకే చేస్తూ షూటింగ్‌ల‌తో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవ‌లే విడుద‌లైన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకుల‌తోపాటు రవితేజ అభిమానుల‌కు కూడా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఈ ఏడాది వ‌రుస‌గా రెండు సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో, ర‌వితేజ కూడా నిరాశ‌లో ఉన్నారు.

ప్రస్తుతం రవితేజ త‌న త‌దుప‌రి సినిమాల‌పై దృష్టి పెట్టారు. తను సైన్ చేసిన మూడు సినిమాలతో బిజీగా మారారు మాస్ మహారాజా. వాటిలో ‘రావ‌ణాసుర‌’ సినిమా ఒక‌టి. సుధీర్ వ‌ర్మ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న రావణాసుర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రావణాసుర క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించే పనిలో ఉన్నారు మేకర్స్.

భారీ సెట్‌లో..

రావ‌ణాసుర‌ (Ravanasura)  క్లైమాక్స్ ఎపిసోడ్‌ను స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌తో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని వినికిడి. క్లైమాక్స్ చిత్రీకరణ కోసం మేక‌ర్స్ భారీ సెట్‌ను నిర్మించార‌ని టాక్. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్  ప్రేక్షకుల‌కు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుందని చెబుతోంది చిత్ర యూనిట్. 

‘రావణాసుర’ సినిమాలో రవితేజ (Raviteja) క్యారెక్టర్‌‌ కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.  రావణాసుర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. 

ఈ సినిమాలో అక్కినేని సుశాంత్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా చేస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ఆర్‌టీ టీం వ‌ర్క్స్ స్వీయ నిర్మాణంలో రావణాసుర సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!