HBD Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !

Updated on Aug 22, 2022 12:10 PM IST
Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ చిత్రాలలో నటిస్తున్నారు.
Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ చిత్రాలలో నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. తెలుగు రాష్ట్రాలలో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మేటి నటుడు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విభిన్న కథానాయకుడు.

సినీ రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలోనూ, సేవా రంగంలోనూ తనదైన శైలిలో రాణించిన ధీరోదత్తుడు చిరంజీవి. ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన జీవితానికి సంబంధించిన టాప్ టెన్ విశేషాలు మీకోసం 

1. చిరంజీవి 1955 ఆగష్టు 22 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. చిరంజీవి తండ్రి పోలీస్ కానిస్టేబుల్. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో చిరంజీవి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది.

2. చిరంజీవి తొలుత చార్టడ్ అకౌంటెంట్ కోర్సు చేయడానికి మద్రాసు వచ్చారు. కానీ ఆయనకు సినీ రంగం మీద ఉన్న అమితమైన ప్రేమ, ఆసక్తి వల్ల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణను తీసుకున్నారు. 

3. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి నటనలో అర్హత పత్రాన్ని పొందిన తర్వాత, 1978లో 'పునాది రాళ్లు' చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రంగా సినీ రికార్డులెక్కింది. కాని 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది.

4. 1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి (Chiranjeevi) వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. సుస్మిత, శ్రీజ. ఒక కుమారుడు రాంచరణ్ తేజ. రాంచరణ్ కూడా సినీ నటుడు. రాంచరణ్ తానే నిర్మాతగా తన తండ్రితో సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలను నిర్మించారు.

5. చిరంజీవి కెరీర్ తొలినాళ్ళలో నటించిన పున్నమినాగు, శుభలేఖ, చంటబ్బాయి, ఛాలెంజ్, విజేత, ఆలయశిఖరం లాంటి సినిమాలు ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. 

6. చిరంజీవి నటించిన కొదమ సింహం చిత్రం ఆంగ్లంలోకి కూడా డబ్ చేయబడింది. "The Hunters of Indian Treasure" పేరుతో హాలీవుడ్‌లోనూ విడుదల చేయబడింది. ఆ తర్వాత 'Abu - The Thief of Baghdad" పేరిట చిరంజీవితో ఓ హాలీవుడ్ సినిమాని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. 

 

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన పోస్టర్

సుప్రీం హీరో నుండి మెగాస్టార్ వరకు.. 

7. 1987 లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల సభలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధం చేసిన విఐపీల జాబితాలో చిరంజీవి పేరు కూడా ఉండడం గమనార్హం. 

8. కె.బాలచందర్, కె.విశ్వనాథ్, భారతీరాజా, బాపు లాంటి ఉద్ధండులైన దర్శకులతో కూడా చిరంజీవి (Chiranjeevi) పనిచేశారు. ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలలో కూడా నటిస్తూ, అశేష జనవాహినిని తన అభిమానులుగా మార్చుకున్నారు. 

ఘరానా మొగుడు, హిట్లర్, మాస్టర్, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాలు చిరంజీవిని మంచి కమర్షియల్ హీరోగా నిలబెట్టాయి. తెలుగులో టాప్ హీరోగా ఆయన స్టామినాని మరింత పెంచాయి

రాజకీయ, సేవా రంగంలో

9. చిరంజీవి రాజకీయ రంగంలో కూడా తన సత్తా చాటారు. శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఆయన వివిధ హోదాలలో ప్రజలకు సేవలందించారు. 

10. చిరంజీవి (Chiranjeevi) సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఈయన ఎందరికో రక్తాన్ని ఉచితంగా సరఫరా చేశారు. అలాగే కరోనా విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న క్రమంలో, ఉచిత ఆక్సిజన్ సిలిండర్లను తన ఫ్యాన్ క్లబ్బుల ద్వారా పంపిణీ చేశారు. అలాగే ఇటీవలే సినీ కార్మికులకు ఉచితంగా ఆరోగ్య సేవలను అందించడానికి, తన తండ్రి పేరిట ఓ ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించారు. 

11. ప్రస్తుతం చిరంజీవి "గాడ్ ఫాదర్" చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తున్నారు. 

మెగాస్టార్‌కు పింక్ విల్లా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు 

Read More:  సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు : చిరంజీవి (Chiranjeevi) నటించిన టాప్ 10 సినిమాలు.. ఫ్యాన్స్‌కు ప్రత్యేకం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!