మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన వైజయంతీ మూవీస్..త్వరలో ఇంద్ర సినిమా రీ రిలీజ్

Updated on Aug 14, 2022 10:02 PM IST
వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌లో చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ఇంద్ర సినిమా త్వరలో రీరిలీజ్
వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌లో చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ఇంద్ర సినిమా త్వరలో రీరిలీజ్

టాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా రిలీజ్ అయ్యిందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులకు కొదవే ఉండేది కాదు. తన కెరీర్‌‌లో ఎన్నో ట్రెండ్ సెట్‌ చేసే సినిమాలు చేశారు చిరు. అంతేకాదు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన సినిమాలు కూడా చిరంజీవి కెరీర్‌‌లో ఉన్నాయి.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌‌ను మలుపు తిప్పిన సినిమా పోకిరి. అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాయడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్‌ చేసింది పోకిరి సినిమా. ఇటీవల మహేష్‌బాబు పుట్టినరోజు జరిగింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా పలు థియేటర్లలో పోకిరి సినిమాను డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేశారు మేకర్స్. రీ రిలీజ్ సమయంలో కూడా మంచి కలెక్షన్లు రాబట్టి పోకిరి సినిమా స్టామినాను మరోసారి నిరూపించుకుంది.

పోకిరి సినిమాకు వచ్చిన క్రేజ్‌తో తమ హీరో సినిమా కూడా రిలీజ్ కావాల్సిందేనని పట్టుబడుతున్నారు మిగిలిన హీరోల అభిమానులు. పవన్‌ కల్యాణ్ నటించిన జల్సా, నాగార్జున న‌టించిన శివ‌, ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన సింహాద్రి సినిమాల రీ రిలీజ్ వార్తలు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం మూవీ ల‌వ‌ర్స్‌ ఎగ్జైట్‌ అయ్యే అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ఈ వార్త నిజమైతే మెగాస్టార్ అభిమానులకు పండుగేనని చెప్పచ్చు.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌లో చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ఇంద్ర సినిమా త్వరలో రీరిలీజ్

4K ప్రింట్‌..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేయనున్నట్టు ప్రక‌టించింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్. ప్రియమైన మెగాస్టార్ అభిమానులకు.. మీరు మాత్రమే కాదు.. మేము కూడా.. ఇంద్ర 4K ప్రింట్‌ని విడుదల చేస్తాము.. కానీ ఇప్పుడే కాదు..కొంత సమయం పడుతుంది.. రిలీజ్ మాత్రం గ్రాండ్‌గా ఉండ‌బోతోంది అని ట్వీట్ చేసింది వైజ‌యంతీ మూవీస్. త్వర‌లోనే చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాను మ‌ళ్లీ థియేట‌ర్లలో చూసే చాన్స్ వస్తుందన్నమాట.

Read More : చిరంజీవి (Chiranjeevi) మెగా లుక్!.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటోలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!