Chiranjeevi : చిరంజీవి చిత్రం 'గాడ్ ఫాదర్' లో నటిస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ !

Updated on Jul 02, 2022 05:43 PM IST
గాడ్ ఫాదర్ (God Father) సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 4వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది
గాడ్ ఫాదర్ (God Father) సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 4వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  నటిస్తున్న గాడ్ ఫాదర్ (God Father) సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంపై భారీ అంచనాలనే ఉన్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.

ముఖ్యమైన పాత్రలో సల్మాన్

ముఖ్యంగా ఉత్తరాది నటుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తుండడంతో.. ఈ ప్రాజెక్టు మీద అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అలాగే పెళ్లయ్యాక కూడా నయనతార ఈ చిత్రంలో నటించడం విశేషం. గతంలో చిరంజీవి, నయన్‌ల కాంబినేషనులో సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.  అయితే, గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార కథానాయకుడికి సోదరి పాత్రలో నటిస్తుందని అంటున్నారు.

అలాగే 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్‌కు తండ్రిగా నటించిన సత్యదేవ్ కూడా 'గాడ్ ఫాదర్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనున్నారని టాక్. మరొక విచిత్రమైన విషయమేంటంటే, చిరంజీవి అర్థాంగి కొణిదెల సురేఖ ఈ చిత్రానికి సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు.

అలాగే గతంలో పవన్ కళ్యాణ్‌తో సుస్వాగతం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన ఆర్బీ చౌదరి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. 

సంగీత దర్శకుడిగా తమన్

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గాడ్ ఫాదర్ (God Father) సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 4వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి వాకాడ అప్పారావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

చిరంజీవి (Chiranjeevi) ఇటీవలే నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం ఏమీ చూపించలేదు. తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి మల్టీ స్టారర్‌గా చేసిన సినిమా సినీ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా నక్సల్ బ్యాక్ డ్రాప్ కథతో వచ్చిన ఈ చిత్రంలో కథానాయకుడికి హీరోయిన్ లేకపోవడం అనేది పెద్ద మైనస్ అయిందని టాక్. ఈ క్రమంలో ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా మీద అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. 

Read More: ఒకే రియాలిటీ షోలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ.. ఇది ఎలా సాధ్యమైంది?

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!