చిరంజీవి (Chiranjeevi) మెగా లుక్!.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటోలు

Updated on Aug 13, 2022 02:09 PM IST
చిరంజీవి (Chiranjeevi)  లేటేస్ట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స్టైలిష్ లుక్‌లో చిరంజీవి క‌నిపించారు.
చిరంజీవి (Chiranjeevi)  లేటేస్ట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స్టైలిష్ లుక్‌లో చిరంజీవి క‌నిపించారు.

చిరంజీవి (Chiranjeevi)  లేటేస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స్టైలిష్ లుక్‌లో చిరంజీవి కాస్త వైవిధ్యంగా క‌నిపించారు.టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్న న‌టుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). వంద‌ల సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌లలో నటించి, ప్రేక్ష‌కుల‌ను చిరంజీవి ఎంట‌ర్‌టైన్ చేశారు. ఆచార్య' ఫ్లాప్ త‌ర్వాత చిరంజీవి ప‌లు సినిమాల‌కు సైన్ చేశారు. అంతేకాదు వ‌రుస షూటింగ్‌ల‌తో బిజీగా మారారు. చిరంజీవి తాజాగా ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం అంతర్జాలంలో వైర‌ల్‌గా మారాయి. 

కొత్త లుక్ ఏ సినిమా కోస‌మో!

చిరంజీవి (Chiranjeevi)  లేటేస్ట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  అంతేకాదు, స్లిమ్ లుక్‌లో ఆయన అదిరిపోయారని కామెంట్స్ కూడా పెడుతున్నారు మెగా అభిమానులు. సూటు.. బూటు.. కోటులో చిరంజీవి కొత్త లుక్‌లో క‌నిపించారు. 'ఆచార్య' సినిమా త‌ర్వాత చిరంజీవి మూడు సినిమాల్లో న‌టిస్తున్నారు. ముఖ్యంగా మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వంలో చిరు గాడ్‌ఫాద‌ర్‌ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. అలాగే ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్‌తో భోళా శంక‌ర్‌, బాబితో వాల్తేరు వీర‌య్య సినిమాలను కూడా చిరు సైన్ చేశారు.

భోళాశంక‌ర్ విషస్

రాఖీ పౌర్ణమి సంద‌ర్భంగా 'భోళాశంక‌ర్' సినిమా నుంచి మేక‌ర్స్.. చిరంజీవి (Chiranjeevi) వాయిస్ వీడియోను రిలీజ్ చేశారు. 'అక్కా - చెల్లెళ్లంద‌రికీ ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు.. ప్రేమ‌తో మీ సోద‌రుడు' అంటూ చిరంజీవి వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

చిరంజీవి, కీర్తిసురేష్ 'భోళాశంక‌ర్' సినిమాలో అన్నాచెల్లెళ్లుగా న‌టిస్తున్నారు. చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ క‌ట్టే స‌న్నివేశాన్ని మేక‌ర్స్ ఈ రోజు వీడియో రూపంలో రిలీజ్ చేశారు. 

Read More: చిరంజీవి (Chiranjeevi) తో భారీ యాక్ష‌న్ సీన్స్‌.. భోళా శంక‌ర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!