చిరంజీవి (Chiranjeevi) తో భారీ యాక్ష‌న్ సీన్స్‌.. భోళా శంక‌ర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్

Updated on Jun 22, 2022 03:06 PM IST
ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్‌లు చిరంజీవి (Chiranjeevi) తో యాక్ష‌న్ సీన్స్ చేయించ‌నున్నారు. 
ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్‌లు చిరంజీవి (Chiranjeevi) తో యాక్ష‌న్ సీన్స్ చేయించ‌నున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) యంగ్ హీరోల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. వ‌రుస సినిమాల‌ను రిలీజ్ చేసి త‌న అభిమానుల‌ను సంతోష పెట్ట‌నున్నారు చిరు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టిస్తున్న‌ భోళా శంక‌ర్ షూటింగ్ స్టాట్ అయింది. మొద‌టి షెడ్యూల్‌లోనే ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ భారీ యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్నారు.  ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్‌లు చిరంజీవితో యాక్ష‌న్ సీన్స్ చేయించ‌నున్నారు. 

చిరు(Chiranjeevi)తో దుమ్ము లేపే ఫైట్ సీన్స్
భోళా శంక‌ర్ చిత్ర‌ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ భారీ అంచ‌నాల‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఆచార్య సినిమా ఫ్లాపుతో ఇటు చిరంజీవి.. అటు మెగా ఫ్యాన్స్ డీలా ప‌డ్డారు. ఇక‌పై చిరంజీవి సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించేలా ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ కూడా అదే బాట‌లో కొన‌సాగుతున్నారు. 

భోళా శంక‌ర్ కోసం ఓ భారీ సెట్స్ కూడా వేయించారు. ఈ సినిమా మొద‌టి షెడ్యూల్‌లో రామ్, ల‌క్ష్మ‌ణ్‌లు క్రియేట్ చేసే ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయ‌ట‌. చిరుతో ఫైట్ సీన్స్ కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేశారు. ఈ విష‌యాల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్‌లు చిరంజీవి (Chiranjeevi) తో యాక్ష‌న్ సీన్స్ చేయించ‌నున్నారు. 

భోళా శంక‌ర్ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి (Chiranjeevi) చెల్లెలి పాత్ర‌లో న‌టించ‌నున్నారు. అగ్ర హీరోల‌తో క‌లిసి న‌టించాలంటే అన్ని సార్లు అవ‌కాశం రాద‌ని కీర్తి సురేష్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.ర‌జ‌నీకాంత్ సినిమాలో చెల్లెలు పాత్ర చేయ‌మ‌ని అడ‌గార‌ని.. అంత పెద్ద స్టార్ ప‌క్క‌న న‌టించే అవ‌కాశం రావ‌డంతో వెంట‌నే ఓకే చేశాన‌న్నారు. చిరంజీవి విష‌యంలో కూడా అలాగే ఆలోచించాన‌ని చెప్పారు కీర్తి.  భోళా శంక‌ర్‌లో చిరు ప‌క్క‌న చెల్లెలుగా న‌టిస్తున్నానని ఆమె చెప్పారు.  

ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్‌లు చిరంజీవి (Chiranjeevi) తో యాక్ష‌న్ సీన్స్ చేయించ‌నున్నారు. 

చిరంజీవికి జోడిగా త‌మ‌న్నా
చిరంజీవికి జోడిగా ఈ సినిమాలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తున్నారు. త‌మన్నా సైరా త‌ర్వాత చిరంజీవితో న‌టిస్తున్న రెండో సినిమా భోళా శంక‌ర్. సైరాలో సెకెండ్ హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టించి మెప్పించారు. ఇక భోళా శంక‌ర్‌లో చిరుతో త‌మ‌న్నా స్టెప్పులేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరిద్ద‌రి కాంబో అదుర్స్ అంటున్నారు చిరు ఫ్యాన్స్

చిరంజీవికి బావ‌గా న‌టించ‌నున్న‌నితిన్? 
భోళా శంక‌ర్  సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చెల్లెలు కీర్తి సురేష్ భ‌ర్త‌గా హీరో నితిన్ న‌టించ‌నున్నార‌ట‌. చిరంజీవి, నితిన్ బావ బావ‌మ‌రిదిలుగా వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. అయితే కేవ‌లం సోష‌ల్ మీడియాలోనే ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అధికారికంగా నితిన్ భోళా శంక‌ర్‌లో న‌టిస్తున్నారో లేదో అనే విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌లేదు.  

భోళా శంక‌ర్ చిత్రీక‌ర‌ణ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. త‌మిళ సినిమా 'వేదాళం' రీమేక్‌గా భోళా శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.  సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై భోళా శంక‌ర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రఘుబాబు, రావు రామేష్, ముర‌ళీ శ‌ర్మ‌,  ర‌వి శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Read More: Brahmastra Trailer : బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ రిలీజ్.. ఇందులో చిరంజీవి డైలాగ్స్ వింటే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!